కొందరు డోరుకు ప్రమాదకరంగా వేలాడుతూ విన్యాసాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రాణాలు పోయే సంఘనటలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో అంతా ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అయితే ఇటీవల కొంత మంది యువత.. జలపాతాలు, సముద్రాలు, క్రూరజంతువులు మొదలైన ప్రదేశాలకు వెళ్లి రీల్స్ తీసుకుంటున్నారు.
కొన్నిసార్లు వాళ్లు తీసుకుంటున్న రీల్స్ వల్ల పక్కన వాళ్లు కూడా ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోవాలని వారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది రన్నింగ్ ట్రైన్ ల ముందు రీల్స్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొకొల్లలు.
రైల్వేశాఖ ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎంత కఠినంగా వ్యవహరించిన కూడా కొంతమంది యువతలో మాత్రం మార్పులు రావడంలేదు. తాజాగా… కొంత మందిమైనర్ యువకులు ఒడిషాలో రన్నింగ్ ట్రైన్ ముందు రీల్స్ తీసుకుంటూ డెంజరస్ స్టంట్ లు చేశారు. ఒక బాలుడు రైల్వే పట్టాల మధ్యలో పడుకున్నాడు. మరో ఇద్దరు ఇతడ్ని వీడియో తీస్తున్నారు.
మరోవైపు నుంచి ట్రైన్ స్పీడ్ గా వస్తుంది. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైల్ స్పీడ్ గా వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడున్న వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేశాడు. రైలు వెళ్లిపొగానే.. గట్టిగా అరుస్తు అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు వాళ్లు అరుస్తు కేకలుపెట్టారు.
pic.twitter.com/o5oYuAzxca Glad the boy is safe, but this trend of chasing viral fame through dangerous stunts needs urgent attention from parents, schools, and authorities.
— Odia Gatha (@odiagatha) July 6, 2025
Strict counselling and awareness are essential to prevent such incidents in future.#Odisha #Boudh #Railways…