భారతదేశం అనేది నిబంధనలపై భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయించే దేశం అని చెప్పారు. రైలును ఆపిన గార్డు గౌరవానికి అర్హుడని మరోకరు చెప్పారు. ఇది చూసిన తర్వాత మానవత్వం ఇంకా బతికే ఉందనిపిస్తోందని ఒకరు.. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని రకరకాలుగా కామెంట్ చేశారు. అయితే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకలితో ఏడుస్తున్న కొడుకు కోసం పాలు కొనేందుకు స్టేషన్‌లో దిగింది. అయితే అప్పుడు రైలు స్టార్ట్ అయింది. మహిళ ప్లాట్‌ఫారమ్‌పైకి పరిగెత్తింది. అయితే అప్పటికే రైలు వేగం పుంజుకుంది.
కదులుతున్న రైలు.. తన పిల్లాడిని తలచుకుని నిసహాయ స్థితిలో ఆ తల్లి బోరున ఏడ్చింది. హృదయాన్ని కదిలించేలా ఆ మహిళ బోరున విలపించింది. ఇది చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ ట్రాక్ పక్కన నిలబడి బోరున విలపిస్తోంది. పాలు కొనుక్కుని తర్వాత స్టేషన్ నుంచి రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ మహిళకు రైల్వే గార్డు దేవదూతలా మారి సాయం చేశాడు.
మహిళ గార్డుకు తన పరిస్థితి గురించి చెప్పడంతో అతను రైలును ఆపాడు. రైలు ఆగిన వెంటనే ఆ మహిళ రైలు ఎక్కేందుకు పరిగెత్తడం వీడియోలో కనిపిస్తుంది. అయితే అసలు మ్యాటర్ ఏంటనే విషయం టీవీ9 ధృవీకరించడం లేదు. @Gulzar_sahab హ్యాండిల్లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ భారీ సంఖ్యలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా వీక్షించారు. ఒక తల్లి పాలు పట్టేందుకు వెళ్లిందని.. రైలు స్టార్ట్ అయ్యిందని వినియోగదారు పేర్కొన్నారు. గార్డు చూసి రైలు ఆపాడు.
A mother went to buy milk, and the train started. The guard saw and stopped the train.🙏❤️ pic.twitter.com/If8PRMxG5T
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) January 7, 2025