ఓ యువకుడు రైలు బోగీలో స్నానం చేస్తాడు. అతడు బాత్రూమ్ లో చేస్తే పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి ఏకంగా బోగీలోని మెట్ల వద్ద స్నానం చేస్తాడు. చుట్టు అందరూ చూస్తున్న ఏ మాత్రం సిగ్గులేకుండా బాతింగ్ కు పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రైలు లోపల చోటు చేసుకుంది. ఆ వీడియోలో రైలులో చాలా తక్కువ మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది.
ఒక వ్యక్తి రైలు తలుపు బయట నిలబడి ఉన్నాడు. అతని ముందు ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయి. అతను ఒక గ్లాసు నుండి నీళ్ళు పోసుకుని స్నానం చేయడం ప్రారంభించాడు. తరువాత అతను కొద్దిగా షాంపూ రాసుకుని మళ్ళీ తన శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేశాడు. చివరికి, అతను మొత్తం బకెట్ తీసుకొని, మిగిలిన నీటిని ఒకేసారి తన శరీరంపై పోసుకున్నాడు.
వైరల్ అవ్వడానికి, అతను చేసిన పని ఇప్పుడు అతన్ని ఇబ్బందుల్లో పడేసింది. మీరు ఇప్పుడు చూసిన ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో @WokePandemic అనే ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. నార్త్ సెంట్రల్ రైల్వే అదే పోస్ట్‌ను వారి ఖాతా (@CPRONCR) నుండి షేర్ చేశారు. దీంతో రైలులో స్నానం చేస్తున్న వీడియోను తీసిన వ్యక్తిని గుర్తించారు.
ఈ వ్యక్తి రీల్ చేయడం ద్వారా ప్రజాదరణ పొందేందుకు ఇలా చేసినట్లు అంగీకరించాడు. సదరు వ్యక్తిపై RPF చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులందరూ ఇతర ప్రయాణీకులకు అనుచితమైన, అసౌకర్యంగా ఉండే ఏ పని చేయవద్దని నార్త్ సెంట్రల్ రైల్వే అభ్యర్థిస్తోంది.
Gems Of Railways
— Woke Eminent (@WokePandemic) November 8, 2025
Man taking bath in a train pic.twitter.com/9h0iLlVwsz
