Traffic Rules: బైక్, స్కూటర్ తాళాలను పోలీసులు లాక్కోవచ్చా..? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి.
Traffic Rules: రోడ్డుపై వాహనాలపై వెళ్తున్నప్రయాణికులకు పోలీసు సిబ్బందికి మధ్య పలుమార్లు మనస్పర్థలు తలెత్తడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుంది. అటువంటి పరిస్థితిలో చాలాసార్లు పోలీసులు వాహనదారులకు మధ్య చిన్నపాటి గొడవ జరుగడం.. ఆ సమయంలో పోలీసులు వాహనం తాళాలు లాక్కోవడం మనం చాలాసార్లు చూస్తుంటాం. కానీ, ఇది సరైనదేనా..? అయితే ట్రాఫిక్ పోలీసులు కొన్ని సందర్భాల్లో మీ బైక్‌కి కీస్ తీసివేయవచ్చు. ఎందుకంటే చాలా సార్లు చెకింగ్ సమయంలో, రైడర్లు తప్పించుకోవడానికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, తప్పుగా పార్కింగ్ చేయడం లేదా మరేదైనా తీవ్రమైన ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే ట్రాఫిక్ పోలీసులు ఇలా వ్యవహరించవచ్చు.
Also Read: కొడుకు పెళ్లైయితే 1,500 కోట్లు ఖర్చు చేసిన అంబానీ, ఖర్చులు కారణంగా 42 వేల మంది ఉద్యోగులను తొలగించిన రిలయన్స్.
భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కీస్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు సంబంధిత వ్యక్తి ద్విచక్ర వాహనాలను డ్రైవ్ చేయలేరు. ముందుగా, కామ్‌గా ఉండండి. పోలీసులతో గౌరవంగా మాట్లాడండి. వారి మాటలు జాగ్రత్తగా వినండి, వారి సూచనలను ఫాలో అవ్వండి. అమర్యాదగా ప్రవర్తించకండి. అధికారితో దురుసుగా ప్రవర్తిస్తే అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వాహనం కీస్ ఎందుకు తీసుకొన్నారు. మీరు ఏ రూల్ బ్రేక్ చేశారో పోలీసులను అడగండి. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు ఏం తప్పు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినట్లు తేలితే, మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: భారతీయులకు శుభవార్త, వీసా అవసరం లేకుండా కొత్తగా మరో 6 దేశాలకు వెళ్ళొచ్చు.
చలాన్ రిసీవ్ చేసుకొని పెనాల్టీ చెల్లించాలి. చలాన్ తప్పకుండా జారీ చేయాలని సంబంధిత ట్రాఫిక్ పోలీసుని కచ్చితంగా అడగాలి. జరిమానా చెల్లించిన తర్వాత, ట్రాఫిక్ పోలీసులు మీ వెహికల్ కీస్‌ని తిరిగి ఇచ్చేస్తారు. పోలీసులు మీ వెహికల్ కీస్‌ని సరైన పద్ధతిలో తీసుకోకపోతే, మీరు సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు. మీతో అధికారులు సక్రమంగా వ్యవహరించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, ట్రాఫిక్ రూల్స్ పాటించడమే ఉత్తమ మార్గం.