కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలే టాక్సిక్ టీజర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ వీడియో యశ్ ఫ్యాన్స్‌కు మాత్రం తెగ నచ్చేసింది. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ ఓపెన్ చేస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో స్మశానం, కారులో యష్ కనిపిస్తాడు. యష్ పక్కన ఓ అమ్మాయి ఉంటుంది. కారు వెనుక బాంబు కనిపిస్తున్నా.. ఇద్దరూ చాలా కూల్‌గా, ఒక రకమైన ఇంటెన్స్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తారు.
అంతలోనే భారీ బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగ్.. పొగలోంచి యష్ మాస్ ఎంట్రీ… యష్ స్వాగ్, ఆటిట్యూడ్ అదిరిపోయినా.. నెటిజన్ల కళ్లు మాత్రం ఆ కారులో యష్ పక్కన ఉన్న అమ్మాయి మీదే పడ్డాయి. ఆ బోల్డ్ లుక్‌లో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరంటూ గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టారు. టీజర్ చూసిన వెంటనే.. ఈ అమ్మాయి హాలీవుడ్ నటి ‘నటాలీ బర్న్’ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

చాలామంది ఫ్యాన్స్ ఇదే నిజమని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ కన్ఫ్యూజన్కి చెక్ పెడుతూ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సీన్ ఫోటో షేర్ చేస్తూ.. “ఈ బ్యూటీ నా సెమిటరీ గర్ల్ బియాట్రిస్” అంటూ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. దీంతో ఆ మిస్టరీ వీడింది. ఆమె ఎవరో కాదు.. బియాట్రిస్ టౌఫెన్‌బాచ్. ఈమె బ్రెజిల్‌కు చెందిన పాపులర్ మోడల్, నటి. 2014లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన బియాట్రిస్.. నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం గ్లామర్ ఫీల్డ్ మాత్రమే కాదు.. మ్యూజిక్, సింగింగ్ అంటే కూడా ఈమెకు చాలా ఇష్టం. చాలామంది నెటిజన్లు పొరబడినట్లు ఈమె ఉక్రెయిన్‌కి చెందిన బ్యాలెట్ డాన్సర్ ‘నటాలీ బర్న్’ కాదు. ఆమె వేరు.. ఈమె వేరు. ‘టాక్సిక్’ టీజర్లో ఉన్నది మాత్రం పక్కా బ్రెజిలియన్ బ్యూటీ బియాట్రిస్. ఒక్క సీన్‌తో ఈమె ఇప్పుడు గ్లోబల్ రేంజ్లో పాపులర్ అయిపోయింది.
