తాబేలు ఉంగరం ఇలా ధరిస్తే ఎవ్వరైనా కోటీశ్వరులవుతారు, ఏ వేలికి పెట్టుకోవాలంటే..?

divyaamedia@gmail.com
1 Min Read

తాబేలు బొమ్మ మాత్రమే కాదు తాబేలు ఉంగరం కూడా శుభ చిహ్నంగానే చూస్తారు. ఈరోజుల్లో చాలా మంది తమ వేలికి తప్పనిసరిగా తాబేలు ఉంగరం ధరిస్తున్నారు. ఈ ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చని నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తాబేలును సంపదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటారు.

అందుకే చాలా మంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కానీ ఈ తాబేలు ఉంగరాన్ని ధరించే విషయంలో కొన్ని రకాల నియమాలు పాటించాలి. రాగి, ఇత్తడితో చేసిన తాబేలు రింగ్స్ కంటే.. వెండితో చేసిన తాబేలు ఉంగరాలు ధరించడం చాలా మంచిది. ఈ ఉంగరాన్ని మధ్య వేలు లేదా చూపుడు వేలికి మాత్రమే ధరించాలి.

తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు పాలతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత గంగాజలంతో కూడా శుద్ధి చేయాలి. నెక్ట్స్ ఈ విగ్రహాన్ని లక్ష్మీ దేవి, దుర్గమ్మ ఫొటోల వద్ద ఉంచి శ్రీ సూక్త పారాయణం చేయాలి. ఆ తర్వాత మాత్రమే తాబేలు ఉంగరాన్ని ధరించాలి. తాబేలు.. లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ రింగ్‌ని శుక్రవారం రోజు ధరిస్తే మరింత మంచిది.

అలాగే ఎలాంటి కారణాలతో తాబేలు ఉంగరాన్ని తీసేసినా.. మళ్లీ లక్ష్మీ దేవి పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత మాత్రమే ధరించాలి. తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయట పడుతారని విశ్వసిస్తారు. అలాగే మనిషిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇంట్లో పురోభివృద్ధి కూడా పెరుగుతుంది. జీవితంలో ఉండే లోపాలన్నీ తొలగుతాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *