సినీ ఇంస్ట్రీలో విషాదం. ప్రముఖ స్టార్ విలన్ కన్నుమూత.

divyaamedia@gmail.com
2 Min Read

మోహన్ రాజ్ తన విలక్షణ నటనతో ఎంతో గుర్తింపు పొందారు. 1988లో మూనం మురా మూవీ ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తరువాత ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మెప్పించారు. ఇక మోహన్ రాజ్ జీవితాన్ని మార్చేసిన సినిమా కిరీడం. డైరెక్టర్ సీబీ మలయిల్ మోహన్ రాజ్ ముఖంలో ఉన్న విలనిజాన్ని చూసి.. కీరికదన్ జోస్ అనే పాత్రను రాశారట. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటినుంచి మోహన్ రాజ్ ను మలయాళ ఇండస్ట్రీ కీరికదన్ జోస్ గానే గుర్తుపెట్టుకుంది.

అయితే కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం మూడు గంటల సమయంలో కన్నుమూశారు. 1988లో మూడో ముర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. మోహన్ రాజ్ కు భార్య ఉష. జైష్మా, కావ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు పవర్ ఫుల్ విలన్ నటుడు మోహన్ రాజ్ . తెలుగులో లారీ డ్రైవర్, చినరాయుడు, రౌడీ రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహరాయుడు చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు.

మెగాస్టా్ర్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా కనిపించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన మోహన్ రాజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా ఆయన మధురైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యూయేషన్ తర్వాత ఆర్మీలో పనిచేసిన ఆయన ఆ తర్వాత కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు.

ఆ తర్వాత మళ్లీ సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ కమిషనల్ హోదాలో కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న మోహన్ రాజ్ గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన మోహన్ రాజ్ పదవీ విరమణ తర్వాత కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు. ఆయుర్వేద చికిత్స కోసం చెన్నై నుంచి ఏడాది క్రితం తిరువనంతపురం వచ్చాడు. ఆయన చివరిసారిగా నరసింహనాయుడు సినిమాలో నటించారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *