మీరు టోల్ ప్లాజా దగ్గరా..? ఈ చిన్న పని చేస్తే చాలు. ఎన్నిసార్లయినా ఫ్రీగా తిరగొచ్చు.

divyaamedia@gmail.com
3 Min Read

హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు, తెలంగాణ పల్లెలకు వెళ్లడానికి ప్రధానమైనవి విజయవాడ హైవే, వరంగల్ హైవే. ఈ హైవేలపై పండుగలు వచ్చాయంటే చాలు వేలాది వాహనాలు బారులు తీరుతాయి. అయితే నేషనల్ హైవేలు, కొన్ని స్టేట్ రోడ్స్ లో టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంటుంది. ఆ రోడ్లపై వెహికల్స్ లో ప్రయాణించిన జనం టోల్ టాక్స్ కట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోల్ టాక్స్ లు వాహనాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కార్లు, జీపులకైతే ఒకలా, బస్సులు, లారీల లాంటి పెద్ద వాహనాలకైతే ఎక్కువ టోల్ ఛార్జ్ వసూలు చేస్తారు. ఇలా వచ్చిన డబ్బుతో రోడ్లు బాగు చేస్తారు. కొత్త రోడ్లు వేస్తారు.

టోల్ ప్లాజాల నుంచి ప్రతి నెలా టాక్స్ రూపంలో రూ. వేల కోట్లు వసూలవుతుంటాయి. భారీ మొత్తంలో వచ్చే ఈ అమౌంట్ పై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. 2024లో భారతదేశంలోని టోల్ ప్లాజాల నుంచి టాక్స్ కలెక్షన్ దాదాపు రూ.1,500 కోట్లకు చేరుకుంది. గత ఏడాది మొదటి త్రైమాసికం కాలంలో పోలిస్తే ఈ సంవత్సరం 32% పెరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా జూన్ 2024లో ఈ కలెక్షన్ రూ. 517 కోట్లుగా నమోదయ్యాయి. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌లో వృద్ధి కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సరికొత్త టారిఫ్ రివిజన్లను అమలు చేస్తోంది.

భారీ ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధిపై ఎక్కువ ఖర్చు పెట్టి అదే విధంగా టోల్ వసూళ్లను మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మీ ఇంటి దగ్గరలో టోల్ ప్లాజా ఉందా? అయితే మీరు ప్రతి పనికి టోల్ ప్లాజా దాటి వెళ్లాల్సి వస్తోందా? ఇలా వెళ్లిన ప్రతిసారీ మీ వెహికల్ నుంచి టోల్ ఫీ కట్ అవుతోంది కదా. ప్రతి సారీ రూ.70 నుంచి రూ.100 వరకు కట్ అవుతోందా? ఇలా చేస్తే ఇకపై మీరు మీ ఇంటి దగ్గరలోని టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా వెళ్లొచ్చు, రావొచ్చు. అయితే కండీషన్ ఏంటంటే మీ ఇంటికి టోల్ ప్లాజాకు మధ్య దూరం 20 కి.మీ. మించి ఉండకూడదు. టోల్ ప్లాజా నుంచి మీరు ఫ్రీగా తిరగాలంటే ముందుగా మీరు మీ ఇంటికి 20 కి.మీ. డిస్టెన్స్ లో ఉన్న టోల్ ప్లాజా వద్దకు వెళ్లి మీ లోకల్ అడ్రస్ ప్రూఫ్ చూపించాలి.

సిబ్బంది అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు లోకల్ టాగ్ ఒకటి ఇస్తారు. దాన్ని మీ ఫాస్టాగ్ కు లింక్ చేస్తారు. దీంతో మీరు ఆ టోల్ ప్లాజా దాటిన ప్రతిసారీ ఉచితంగా వెళ్లి రావొచ్చు. దీనికి మీ ఫాస్టాగ్ నుంచి కూడా డబ్బులు కట్ అవ్వవు. లోకల్ టాగ్ తీసుకోవడానికి మీరు ప్రతి నెలా సుమారు రూ.250 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాను బట్టి ఈ అమౌంట్ మారుతూ ఉంటుంది. మీ దగ్గర్లోని టోల్ ప్లాజాకు వెళ్లి లోకల్ టాగ్ ఫీజ్ వివరాలు తెలుసుకోండి. అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడంతో పాటు నెల నెలా టోల్ ఫీ కట్టడం వల్ల మీరు మీ దగ్గర్లోని టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా తిరగొచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *