ప్రతిరోజూ లక్షలాది వాహనాలు టోల్ ప్లాజాల గుండా వెళ్తుంటాయి. వీటి కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమనిబంధనలు రూపొందించి. ఈ నియమాల్లో ఒకటి 10 సెకన్ల రూల్. దీని ప్రకారం.. టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నిలిచి ఉన్నట్లయితే.. అలాంటి వాహనానికి టోల్ ఛార్జ్ వర్తించదు. అయితే టోల్ ప్లాజాల వల్ల రద్దీ చాలామందిని ఇబ్బందికి గురిచేస్తుంది.
దీనివల్ల విలువైన సమయం వృధా అవుతుంది. సాధారణంగా పండగల పూట సొంత గ్రామాలకు వెళ్లాలనే ఆత్రుత చాలా మందిలో ఉంటుంది. అటు ముందుకు వెళ్లలేక…ఇటు వెనక్కి వెళ్లడానికి మనసు ఒప్పక ఇబ్బంది పడుతుంటారు. అదే అటువంటి వారి కోసం టోల్ ప్లాజాలో ఒక నిబంధన ఉంది.. ఆ నిబంధన టోల్ ప్లాజా వద్ద ఎదురుచూసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

జాతీయ రహదారుల మీద ప్రయాణించేవారు టోల్ ప్లాజాల వద్ద చిక్కుపోయినప్పుడు అక్కడ మినిమం వెయిటింగ్ టైం అనే రూల్ ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సర్కులర్ ప్రకారం టోల్ బూత్ వద్ద ఒక వాహనం 10 సెకండ్లకు మించి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోతే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. క్యూ 100 మీటర్ల లోపల వచ్చేవరకు ముందున్న వాహనాలను ఫీజు లేకుండానే వదిలేయాలి. వాస్తవానికి ఈ నిబంధన చాలామందికి తెలియదు.
ఒకవేళ తెలిసినా వసంత గ్రామాలకు వెళ్లాలి అనే ఆతృతలో దానిని పట్టించుకోరు. ఎంత కష్టమైనా సరే టోల్ ప్లాజాలో ఎదురు చూసి.. తమకు కాస్త వెసలు బాటు లభించగానే ముందుకు వెళ్తుంటారు. కేవలం ఇవి మాత్రమే కాదు టోల్ ప్లాజా లో దురుసుగా ప్రవర్తించినా.. అదనపు రుసుము వసూలు చేసినా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అత్యవసర వైద్య విభాగాన్ని.. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉచితంగా వాడుకునే సౌలభ్యం ఉంటుంది. వాహనాల టైర్లలో గాలి నింపుకోవడానికి.. అంబులెన్స్ సౌకర్యాలను ఉపయోగించుకునే హక్కు కూడా ఉంటుంది.