బంగారం ధర ఈ నెల ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 5 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధర భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న కారణాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. పసిడి ధరలు ఈ రేంజ్ లో పెరగడం కారణంగా ప్రతిరోజు రికార్డులను నమోదు చేస్తున్నాయి. అయితే దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది.
దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు తగ్గి, వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. అయితే, అక్టోబర్ 24తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 25న బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,840 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,460లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 1,01,900ల కొనసాగుతోంది.
బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,610 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,840, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,460లుగా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.72,840, 24 క్యారెట్ల ధర రూ.79,460 గా ఉంది. వెండి ధరలు..హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.109,900, విజయవాడ, విశాఖపట్నంలో రూ.109,900లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,01,900, ముంబైలో రూ.1,01,900, బెంగళూరులో రూ.1,01,100, చెన్నైలో రూ.1,09,900 లుగా ఉంది.