ప్రజలకు గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.

divyaamedia@gmail.com
2 Min Read

భారతీయు మహిళలు పసిడి ప్రియులు. పండగలు, శుభకార్యాలు ఇలా ఏ సందర్భంలోనైనా సరే బంగారం నగలు ధరించడానికి ఇష్టపడతారు. తమ ఆర్ధిక శక్తిమేరకు పసిడి కొనుగోలు ఆసక్తిని చూపిస్తారు. బంగారం ఒక స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఆర్ధిక భరోసా ఇచ్చే ఒక వనరు కూడా. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకంపై పసిడి ధరలు ఆధారపడి ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు.

అయితే నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 22 క్యారెట్స్ పసిడి పది గ్రాముల రేటు రూ. 150 తగ్గింది. దాంతో నేడు భాగ్యగనరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల రేటు రూ. 68,600 మార్కుకు చేరింది. అంతకుముందు రెండు సెషన్లలో 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల రేటు ఏకంగా ఇది రూ. 900, రూ. 350 చొప్పున 1250 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. నేడు మాత్రం 150 తగ్గి కాస్త ఊరట కలిగింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ. 160 దిగివచ్చి.. 74,840 రూపాయల వద్ద అమ్ముడవుతోంది.

24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు కూడా క్రితం 2 రోజుల్లోనే రూ. 980, రూ. 380 మేర పెరిగిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగి వచ్చాయి. నేడు హస్తినలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 పడిపోయి 10 గ్రాములకు రూ. 68,750 వద్దకు దిగి వచ్చింది. ఇంకా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాముల మీద రూ. 160 తగ్గి ప్రస్తుతం రూ. 74,990 వద్ద ఉంది. బంగారం బాటలోనే వెండి రేటు.. బంగారం ధరలతో పోలిస్తే వెండి రేట్లు భారీగా దిగొచ్చాయి.

ఢిల్లీలో ఒక్కరోజే సిల్వర్‌ రేటు కేజీ మీద రూ. 1300 తగ్గింది. దాంతో నేడు హస్తినలో వెండి ధర కిలో రేటు రూ. 94,700 కు దిగొచ్చింది. అంతకుముందు రోజు రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా వెండి ధర కేజీ మీద రూ. 1300 పడిపోయి ప్రస్తుతం రూ. 99,200 కు చేరింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *