చిరుతల ఉనికిపై భయాలు – ఈ ఘటన అనంతరం తిరుపతి పరిసరాల్లో చిరుతల సంచారంపై భయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారి, అలిపిరి కాలినడక మార్గాల్లో ఇటీవలి కాలంలో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. అయితే చిరుత దాడికి అతి తృటిలో తప్పించుకున్న బైకర్‌లు- ఈ ఘటన తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ రోడ్డుపై చోటుచేసుకుంది.
రెండు చక్రాల వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తామేదో సాధారణంగా వెళ్తున్నట్లు అనుకుంటుండగానే, రోడ్డు వైపున ఉన్న పొలాల్లోంచి అకస్మాత్తుగా చిరుత బయటకు వచ్చి వారి బైక్‌పై దూకబోయింది. చిరుత ఒక్క ఇంచ్ తేడాతో వదిలి వేసింది. వెంటనే అది తిరిగి చీకటి పొదలలోకి వెనక్కి పరుగెత్తింది. బైక్‌పై ఉన్న వారు ఈ దాడి గురించి చివరి క్షణం వరకూ ఏమి ఊహించలేకపోయారు.
ఆ సంఘటన జరిగిన తర్వాత వారు ఆపకుండా, వెనక్కి చూడకుండా వేగంగా వెళ్లిపోయారు. వారు అర్థం చేసుకునే లోపే ప్రాణాలు తప్పించుకున్నారు. వాళ్లకు ఈ భూమిపై ఇంకా నూకలు మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. లేదంటే క్షణాల్లో ప్రమాదం తప్పింది.
తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై దాడికి యత్నించిన చిరుత
— BIG TV Breaking News (@bigtvtelugu) July 26, 2025
తృటిలో తప్పించుకున్న బైకర్ pic.twitter.com/OqkF3tI7DH