శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలలో చిరుత కలకలం, ఎలా కుర్చుందో చుడండి.

divyaamedia@gmail.com
1 Min Read

తిరుమల శిలాతోరణం వద్ద ఇవాళ సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. అయితే తాజాగా.. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది.. శిలాతోరణం దగ్గర చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ, టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని.. ఒంటరిగా వెళ్లొద్దని.. చిరుత కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వదర్శనం క్యూలైన్‌ సమీపంలోనే చిరుత కనిపించడంతో భక్తులు వణికిపోయారు.

కాగా.. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో, వీడియో వైరల్‌గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో.. అధికారులు.. సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతను మరింత పెంచారు.. గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని పొట్టనపెడ్డుకుంది చిరుత.

లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అంతేకాకుండా.. పలువురు భక్తులపై కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి.. అంతకుముందు జరిగిన సంఘటనల దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *