తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తు పట్టారా..?

divyaamedia@gmail.com
2 Min Read

స్వాతి దీక్షిత్ భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, బెంగాలీ చిత్రాలలో నటించింది. స్వాతి, 2010లో వచ్చిన “ఏం పిల్లో ఏం పిల్లడో” చిత్రంలో హీరోహీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఆమె 2012లో బెంగాలీలో “తోర్ నామ్” సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. అయితే గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి తిరుమలలో ప్రత్యేక్షమైంది. అప్పట్లో స్లిమ్ గా నాజుకుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? చాలా మంది హీరోయిన్లలానే ఈ బ్యూటీ కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది. అయితే ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది.

దీంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయిందీ అందాల తార. ఈ బ్యూటీ చివరిగా 2021లో రామ్ గోపాల వర్మ తెరకెక్కించిన దెయ్యం సినిమాలో నటించింది. రాజశేఖర్ కూతురిగా కనిపించింది. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఆర్జీవీ తెరకెక్కించిన దెయ్యం సినిమా హీరోయిన్ స్వాతి దీక్షిత్. . 2010లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది స్వాతి. ఇందులో హీరోయిన్ ప్రణీత స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత జంప్‌ జిలానీ, బ్రేకప్‌, చిత్రాంగద, దెయ్యం తదితర చిత్రాల్లో యాక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ (2020) లోనూ సందడి చేసింది స్వాతి దీక్షిత్. అయితే హౌస్ లో కేవలం మూడు వారాలు ఉండి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఆర్జీవీ దెయ్యం తర్వాత మరే సినిమా, టీవీ షోలోనూ స్వాతి కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంటాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *