వామ్మో.! ఈ మహిళా గురించి తెలిస్తే పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. ఏకంగా 8మంది భర్తలతో..!

divyaamedia@gmail.com
2 Min Read

ధనికులైన పెళ్లికాని వ్యక్తుల వివరాలు సేకరించి వాళ్లకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రిక్వెస్ట్‌లు పెట్టి వారితో పరిచయం పెంచుకుంటుంది. అలా వాళ్లతో మెల్లగా మాటలు కలిపి తన మాయలోకి దించుతుంది. అయితే మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సమీరా ఫాతిమా రూటు సపరేటు. మిగిలిన అమ్మాయిల మాదిరి కాకుండా మ్యాట్రిమోనీ.. సోషల్ మీడియాలో డబ్బున్న మగాళ్లను టార్గెట్ చేసేది. తన భర్త చనిపోయాడని.. కష్టాల్లో ఉన్నట్లుగా చెప్పేది.

తనకు ఒక్క బిడ్డ ఉన్నట్లుగా చెప్పి.. తన మాటలతో సానుభూతి పొందేలా చేస్తుంది. అనంతరం వారికి దగ్గర కావటం.. పెళ్లి చేసుకుంటుంది. వారి మధ్య సాగే సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేస్తుంది. వాటిని ఎడిట్ చేసి.. తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసేది. బాధితుల్లో ఒకరు ఆమెకు రూ.50 లక్షలు సమర్పించుకోగా.. మరొకరు రూ.15 లక్షలు.. ఇలా అందరిని అడ్డంగా బుక్ చేసేది. ఆమె బాధితుల జాబితాలో రిజర్వు బ్యాంకు అధికారి కూడా ఉండటం గమనార్హం.

అయితే.. ఆమె చేసే మోసాలు ఆమె ఒక్కతే కాదు.. ఒక టీంగా ఏర్పడి చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద నమోదైన కేసుల నుంచి తప్పించుకు తిరుగుతూనే.. కొత్త టార్గెట్లను ఫిక్సు చేసుకొని వారిని మోసం చేయటం చూస్తే.. ఆమె టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఒక సందర్భంలో ఆమె అరెస్టు అయ్యే పరిస్థితుల్లో తాను ప్రెగ్నెంట్ అని చెప్పి తప్పించుకొని పరారైనట్లుగా తెలుస్తోంది.

ఆమెకు ఇప్పటికే 12 ఏళ్ల కుమార్తె ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ పాప తండ్రి ఎవరన్న దానిపై స్పష్టత రాలేదు. అరెస్టు చేసిన ఈ కిలేడీని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఆమెను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక.. ఆమె చేతిలో మోసపోయిన ఎనిమిది మంది మాజీ భర్తలు తాము మోసానికి గురైన వైనానికి సంబంధించిన అఫిడవిట్లు సమర్పించారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో ఆసక్తికర కోణం ఏమంటే.. ఆమె తాను పెళ్లాడిన ఎనిమిది మందిని చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. ఏ ఒక్కరితోనూ విడాకులు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించారు. ఈమె వెనుకున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *