ఈ బియ్యం పురుషులకు గొప్ప వరం, ఈ బియ్యం గురించి ఈ విషయాలు తెలిస్తే.. అస్సలు ఆగలేరు.

divyaamedia@gmail.com
2 Min Read

భారత దేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి. ఇది దక్షిణ భారతీయులకు ముఖ్యమైన ఆహారం. దేశంలో ఉన్న 50 శాతం పంట భూములలో వరి పండుతుంది. ఇప్పటికీ దేశంలో 70 శాతం జనాభాకు వరి అన్నం తినడం అలవాటు. ఒకప్పుడు భారత్‌ వరి పంటలో విదేశాలపై ఆధారపడింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి ఇప్పుడు దేశీయవరి వంగడాలకు సంబంధించి ఓ గుర్తింపు వచ్చింది. గ్రామానిక చెందిన షేక్‌ సుభాని వివిధ రకాల వరి వంగడాలను సాగుచేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

పదో తరగతి వరకు చదువుకున్న ఆయనకు. ఆరోగ్యాన్ని ఇచ్చే వరి రకాలను పండించడమంటే ఆసక్తి. గూగుల్‌, యూట్యూబ్‌ లాంటి సామాజిక మధ్యామాలద్వారా రకరకాల వరి వంగడాల గురించి తెలుసు కుంటూ.. విత్తనాలు సేకరించి సాగుచేస్తున్నారు. గత ఆరేళ్లుగా సేంద్రీయ పద్దతిలో దేశీ, విదేశీ వరి విత్తనాలను సేకరించి వినూత్న పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యువరైతు తనకున్న 1.20 ఎకరాల పొలంలో 60 రకాల వరి వంగడాలను పండిస్తున్నారు. వీటిలో రత్నచోడి, దత్వాన్, మాండియా మాంజా, నవారా, మురినీ ఖైమా, కిన్నార్, తులాయిపాజ్, బహుముఖి, బంగారు గులాబీ తదితర వంగడాలు ఉన్నాయి.

మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి విత్తనాలను సేకరిస్తున్నారు. పూర్తిగా ప్రకృతి విధానంలోనే సేద్యం చేయడం విశేషం. అయితే పాకల గ్రామంలో తనకున్న కేవలం ఎకరా పొలంలోనే సాగుచేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’. అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలున్నాయి. అలాగే తులసి బాసో, ఇంద్రాయణి, కాలాబట్టి, మాపిళైసాంబ రకాలు ఉన్నాయి. వీటిలో మాపిళ్లై సాంబ రకం వరికి మంచి పోషక విలువలతో పాటు ఆదరణ కూడా బాగానే ఉంటుంది.

ఈ బియ్యాన్ని పెళ్ళికొడుకు బియ్యంగా పిలుస్తారు. కొత్తగా పెళ్ళయిన దంపతులకు ఇవ్వడం గతంలో ఆచారంగా ఉండేది. ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యవృద్ధి కలుగుతుందని చెబుతారు. తమిళనాడులోని తిరవణ్ణామలై ప్రాంతం ఈ విత్తనాలకు మూలకేంద్రంగా ఉంది. నాగపట్టణం, తిరుచ్చురాపల్లి, తంజావూర్ జిల్లాల్లో రైతులు కొంతమేరకు ఈ సాగుచేస్తూ వస్తున్నారని, ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నట్టు తెలుసుకుని తాను కూడా సేకరించి సాగు చేస్తున్నట్టు యువరైతు సుభాని చెబుతున్నారు.

ప్రస్తుతం పాకల గ్రామంలో యువ రైతు సుభాని చేస్తున్న వివిధ రకాల దేశవాఠీ వరి వంగడాల సేద్యం గురించి తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు అతడ్ని ప్రోత్సహిస్తున్నారు. వారానికి ఒకసారి సుభాని పొలానికి వచ్చి వరి వంగడాలను పరిశీలిస్తున్నారు. సుభాని లాగే ఇతర రైతులు కూడా దేశవాళీ వరి వంగడాలను తమ పొలంలో కనీసం పావువంతైనా సాగు చేయాలని పాకల అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ కిషోర్‌ సూచిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *