మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సుష్మ (27)కు నాలుగు సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న యశ్వంత్ రెడ్డితో వివాహమైంది. వీరికి యశ్వవర్ధన్ రెడ్డి (10 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పార్థలు వచ్చినట్లు తెలుస్తంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి.
ఈ క్రమంలోనే సుష్మ తల్లి లలిత (44) ఫంక్షన్ షాపింగ్ కోసం ఇటీవల కూతురు ఇంటికి వచ్చింది. అయితే సరూర్‌నగర్ నివాసం ఉంటున్న యశ్వంత్ రెడ్డితో సుష్మిత పెళ్లి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లి జిరిగింది. వీళ్లకు ప్రస్తుతం 10 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు కుటంబసభ్యులు చెప్తున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం తన 10 నెలల కుమారుడికి కుమారుడికి విషం ఇచ్చిన తల్లి సుస్మిత.. కొడుకు చనిపోగానే తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు సుష్మిత, మనవడు చనిపోయారన్న మరణవార్త విన్న సుష్మిత తల్లి లలిత షాక్‌కు గురైంది. దీంతో ఆమెకూడా ఆత్మహత్యకు యత్నించింది.
ఇంతలో ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన యశ్వంత్‌కు ఇంట్లో భార్య, కొడుకుతో పాటు అత్త అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో వాళ్లను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే భార్య, కుమారుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
