ఈ ఆకులను ఇలా చేసి తీసుకుంటే చాలు, 300 రోగాలను తగ్గించే దివ్య ఔషదంఇదే.

divyaamedia@gmail.com
2 Min Read

మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. అయితే మునగాకులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తాయి. మునగ చెట్టు ఆకులే కాకుండా.. దీనికాయలు, బెరడు అన్నీ.. మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మునగాకును తీసుకుంటే మన శరీరంలో శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయి.

దీంతో అలసట, బలహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇదే మన బలహీనతను, మగతను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి నిమ్మకాయ, నారింజ వంటి పండ్లే సహాయపడతాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ సిట్రస్ పండ్లలో కంటే ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుంది తెలుసా. మునగాకులను తీసుకుంటే మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో ఇమ్యూనిటీని పెంచే ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటువ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. ఇవి విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుమును కలిగి ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బలంగా చేస్తాయి.

మునగాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయడమే కాకుండా.. డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మునగాకులో క్లోరోజెనిక్ ఆమ్లం అని పిలువబడే వర్ణద్రవ్యం కూడా మెండుగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. చాలా మంది శరీర మంటతో బాధపడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరమైనదేం కాదు. కానీ మునగాకు దీనిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మునగాకు ఒక శక్తివంతమైన శోథ నిరోధక ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే తాపజనక ఎంజైమ్లను అణచివేస్తుంది. అలాగే శోథ నిరోధక సైటోకిన్ల ఉత్పత్తిని పెంచి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

మునగాకు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇది హృదయనాళ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. దీంతో మనకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. మునగాకులు మన జీర్ణవ్యవస్థకు కూడా బాగా సహాయపడతాయి. ఈ ఆకులను తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, గ్యాస్ట్రైటిస్, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. మునగాకుల్లో భాస్వరం, కాల్షియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మునగాకులు శోథ నిరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, కాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మీ ఎముకలను బలంగా ఉంచుతాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *