అష్టైశ్వర్య ప్రదాత లక్ష్మీ దేవి అయితే దానిని మనదాకా అందించేవాడు కుబేరుడు యక్షులకు నాయకుడు. కుబేరుని పూజిస్తే సిరులు కలుగుతాయి. మరి ఆ కుబేరుణ్ణి లక్ష్మీదేవితో సహా పూజిస్తే తప్పక ధనప్రాప్తి, ఐశ్వర్యం లభిస్తాయని పండితుల అభిప్రాయం.అయితే దేశంలో లక్ష్మీ ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఆలయాన్ని సందర్శిస్తే పేదరికం తొలగిపోతుందని ప్రజల నమ్మకం. అంతేకాదు ఇక్కడ కుబేరుడికి నాణేలను సమర్పించడంతోపాటు ఇతర భిన్నమైన సంప్రదాయాలు ఆకట్టుకుంటాయి.
సంపదకు దేవుడైన కుబేరుడి ఈ ఆలయం దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని జగేశ్వర్ ధామ్ అని పిలుస్తారు. పేదరికం పోవాలనే కోరికతో ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పేదరికం నుంచి విముక్తి..కుబేరుడి ఆశీర్వాదం లభించిన వ్యక్తికి కీర్తి, సంపద మొదలైనవి లభిస్తాయని నమ్మకం. ప్రతిరోజూ భక్తులు వివిధ కోరికలతో ఈ ఆలయంలోకి వెళ్లి కుబేరుడిని ప్రార్ధిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడని.. జీవితంలోని సమస్యల నుంచి బయటపడతాడని నమ్ముతారు.
బంగారు వెండి నాణేలు సమర్పణ.. ఈ ఆలయంలో కుబెరుడిని దర్శింసుకోవడమే కాదు బంగారు లేదా వెండి నాణేలను సమర్పిస్తారు వాటికి పూజలు చేసిన.. ఆ నాణేలను పసుపు వస్త్రంలో కట్టి ఇంటికి తీసుకువెళతారు. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని విశ్వాసం. ఈ ఆలయానికి వెళ్ళడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మళ్ళీ ఆలయానికి వెళ్లి కుబేరుడికి బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆలయ చరిత్ర.. జగేశ్వర్ ధామ్ కాంప్లెక్స్‌లో ఉన్న 125 ఆలయ సమూహాలలో ఒక ఆలయం.. సంపదకు అధినేత అయిన కుబేరుడి ఆలయం ఉంది. ఇది భారతదేశంలోని ఎనిమిదవ కుబేరు దేవాలయం. ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. ఈ పురాతన ఆలయం భక్తులకు విశ్వాసానికి ప్రధాన కేంద్రం. కుబేరుడు ఇక్కడ ఏకముఖ శివలింగంలో శక్తి రూపంలో ఉన్నాడు.