రక్షాబంధన్ పండుగ ప్రతి ఒక్క రికీ చాలా ఇష్టం ఉంటుంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు సోదరీమణులు, తమ సోదరులకు ప్రేమతో రాఖీ కడతారు. అంతే కాకుండా సోదరీమణులకు సోదరులు బహుమతులు ఇస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని చుడియా ఖేడాలోని హల్దౌర్ అడవిలో ఉంది అన్నాచెల్లెల ఆలయం. శతాబ్దాలుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి.
ఈ ఆలయం సోదరుడు, సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నం. మనం నమ్మకాలను విశ్వసిస్తే, అది సత్యయుగానికి సంబంధించినదని చెబుతారు. చుడియా ఖేడా అడవిలో పూర్ణ శక్తి పీఠ ఆలయం ఉంది. ఇక్కడ అన్న, చెల్లెల్లు రాతిపై దేవతల రూపంలో కూర్చుని ఉంటారు. వీరితో పాటుగా అనేక ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయంలో ప్రతిష్టించబడ్డాయి. స్థానిక ప్రజలు ఈ ఆలయంపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు.
రక్షా బంధన్ పండుగ నాడు ఈ ఆలయంలో ఒక గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ నాడు విందు నిర్వహిస్తారు. ప్రతి నెల శుక్ల పక్ష సోమవారం నాడు భక్తులు ప్రసాదం అందిస్తారు. ఆలయం, స్థానిక ప్రజలతో ముడిపడి ఉన్న పురాణం ప్రకారం, ఒకనాడు దొంగలు అన్న ఎదురుగానే తన చెల్లెలితో దురుసుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు.
అప్పుడు ఆ అన్న తన సోదరి గౌరవాన్ని కాపాడమని దేవుడిని ప్రార్థించాడు. ఆ ఇద్దరు సోదరసోదరీమణుల గౌరవాన్ని కాపాడటానికి.. దేవుడే ఇక్కడ ప్రత్యక్షమై వారిని రక్షించాడని స్థానికులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి రక్షాబంధన్ వేడుకలు భాయీ-బెహన్ ఆలయంలో చేసుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లను, అక్కాతమ్ముళ్లను రక్షించడానికి దేవుడే ఇక్కడ భూమిపైకి వచ్చాడని అక్కడి స్థానిక ప్రజల నమ్మకం.
ఆ తరువాత వారిద్దరూ అక్కడే శిలగా మారారని చెబుతారు.. అప్పటి నుండి అన్నయ్య, సోదరి విగ్రహాలు ఆలయంలో రాళ్ల రూపంలో ఉన్నాయని చెబుతారు. ఈ ఆలయంలో తల వంచి నిజమైన హృదయంతో ప్రార్థించే వారికి దేవతల రూపంలో ఉన్న అన్నాచెల్లెళ్ల ఆశీస్సుల వల్ల దీర్ఘాయుష్షు, సుఖ సంతోషాలు లభిస్తుందని స్థానిక ప్రజలు చెబుతారు.