వివిధ రకాల ఆహారపు అలవాట్లు, వేళాపాళా లేని తిండి అలవాట్లు, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా ఉంటోంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించలేకుంటే ప్రాణాంతకం కావచ్చు. ఈ సమస్య ఉంటే మీరు ఎంత తిన్నా శరీరంలో సంగ్రహణ కాదు. ఎందుకంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తినే ఆహారంలోని పోషకాలు శరీరంలో సంగ్రహణ కావు. ఫలితంగా లివర్ ఫెయిల్ అవుతుంది.
అయితే సాధారణ పరిమాణంలో మిల్క్ టీ తాగడం వల్ల కాలేయం నేరుగా కొవ్వుగా మారదు. రోజుకు చాలాసార్లు అదనపు చక్కెర, పాలు, క్రీమ్ కలిపిన టీ తాగితే ప్రమాదం. అది శరీరంలో కొవ్వును పెంచడం ద్వారా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. కొవ్వు కాలేయంతో పోరాడగలవు. ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో గ్రీన్ టీ తాగడం ప్రయోజనకరం. రోజుకు 1 నుండి 2 కప్పుల టీని తేలికపాటి పాలతో త్రాగాలి. ఎక్కువ చక్కెర, క్రీమ్ లేదా పాలు తాగొద్దు.
గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగండి. మీకు ఇప్పటీకే ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే టీ తాగండి. ఆలా కాదంటే సమస్యలు తప్పవు. అందుకే జాగ్రత్త పడాలి. ఏదైన ఎక్కువగా తీసుకొంటే అనారోగ్యం బారిన పడతారు. అందుకే అన్ని కూడా శరీరానికి సరిపడా తీసుకోవడం మంచిది.