ఆయనకు స్వయంగా ఉత్తరం రాసిన రతన్‌ టాటా..! ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

1990లలో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టి.. దేశాభివృద్ధికి బాటలు వేశారు పీవీ నరసింహారావు. అయితే, ఆనాడు ప్రధానిగా పీవీ తీసుకున్న నిర్ణయాన్ని బలంగా సమర్థించారు ఇటీవల కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. రతన్ టాటా రాసిన లేఖ తాజాగా వైరల్‌గా మారింది. అయితే భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన పీవీ నరసింహారావును ప్రశసింస్తూ రతన్‌ టాటా ఈ లేఖను రాశారు. ఆగస్ట్ 27, 1996లో రతన్‌ టాటా తన స్వహస్తాలతో రాసిన లేఖను గోయెంకా షేర్‌ చేశారు.

ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారని ఈ లేఖలో పీవీని రతన్‌ టాటా కొనియాడారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకొని దూరదృష్టితో మీరు ఆలోచించిన తీరును ప్రశసించకుండా ఉండాలేమని, ప్రతీ భారతీయుడు మీకు రుణపడి ఉండాలని రతన్‌ టాటా పీవీకి ఉత్తరం రాశారు. ఈ లేఖలో ఏముందంటే..! ప్రియమైన శ్రీ నరసింహారావు గారు,

‘నేను ఇటీవలి కాలంలో మీపై క్రూరమైన ఆర్టికల్స్ చదివాను, ఇతరులు మిమ్మల్ని చాలా చిన్న చూసినప్పటికీ.. భారతదేశంలో చాలా అవసరమైన ఆర్థిక సంస్కరణల అమలు చేయడంతో మీరు సాధించిన అత్యుత్తమ విజయాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తించి, గౌరవిస్తానని మీకు చెప్పడానికి మీకు ఈ లేఖ వ్రాయవలసి వచ్చింది. మీరు, మీ ప్రభుత్వం ఆర్థిక కోణంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు.. మమ్మల్ని ప్రపంచంలో భాగం చేశారు. భారతదేశ సాహసోపేతమైన, దూరదృష్టితో మీరు చేసిన ఈ పనికి ప్రతి భారతీయుడు మీకు కృతజ్ఞతతో రుణపడి ఉండాలి.

మీ విజయాలు ముఖ్యమైనవి, అత్యద్భుతమైనవి అని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను, మరియు వాటిని ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ సమయంలో నా ఆలోచనలు, శుభాకాంక్షలు మీతో ఉన్నాయని.. భారతదేశం కోసం మీరు చేసిన వాటిని ఎప్పటికీ మరచిపోలేని ఓ వ్యక్తిని ఉన్నానని చెప్పడమే ఈ లేఖ యొక్క ఉద్దేశం. హృదయపూర్వక శుభాకాంక్షలు, మీ భవదీయులు’ రతన్‌ అంటూ ఆయన లేఖ రాశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *