తీవ్ర అస్వస్థతతో 86 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో బుధవారం రాత్రి భువి నుంచి దివికేగారు. రతన్ టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. అందరూ తమదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో రతన్ టాటా చివరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చివరి పోస్ట్ చదివిన ప్రజలు ఒక్కరూ రతన్ టాటా చివరి కోరిక నిజం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే రతన టాటాను ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు.
ఆయన మళ్లీ బతికొస్తే బావుండు అని అనుకోనివారుండరు. అలా భావించిన ఒక వ్యక్తి రతన్ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్ టాటా ఈ వీడియోలో కనిపించారు.
రతన్ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి ‘చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి’ అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
Best use of ‘AI’ ❤️ pic.twitter.com/FLreHPZr0I
— Yash Gowda (@yash_gowdaa) October 11, 2024