ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత.

divyaamedia@gmail.com
1 Min Read

టార్జ‌న్ టీవీ సీరిస్ ఒక్క హాలీవుడ్‌లోనే కాకుండా సినీ ప్రేమికులంద‌రికీ ఎంతో ప‌రిచ‌యం. ఇక్కడి ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతో బాగా ఆక‌ట్టుకుంది. 86 ఏళ్ల వయస్సులో రాన్ ఏలీ మృతిచెందారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న కూతురు కిర్‌స్టెన్ ఎలీ సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకున్నారు. అయితే, ఆయ‌న ఎప్పుడు, ఎలా చ‌నిపోయార‌నే విష‌యాన్ని మాత్రం తెల‌ప‌లేదు.

అయితే హాలీవుడ్ చిత్రం టార్జాన్ లో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన రాన్ ఎలీ కన్నుమూశారు. ఆయనకు 84 ఏళ్లు. ఆయన కుమార్తె కిర్‌స్టెన్ కాసాలే ఆయన మరణం గురించి తెలియజేశారు. ఆయన సెప్టెంబర్ 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్‌లోని తన ఇంటిలో కన్నుమూశారు. కిర్‌స్టన్ తన తండ్రికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా ఆయన మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. రాన్ ఈలీ 1960ల NBC సిరీస్ టార్జాన్‌లో ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత 2001లో నటనకు స్వస్తి చెప్పి రచన వైపు మళ్లారు. ఆయన రెండు మిస్టరీ నవలలు రాశారు. టార్జాన్‌లో అతని ప్రసిద్ధ పాత్ర మంచి ఆదరణ పొందింది.

నటుడు , రచయిత, అతను గురువుగా కూడా చాలా మంది అభిమానం సొంతం చేసుకున్నాడు. ‘ప్రపంచం చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయాను, నాన్న. ఆయన నటుడు, రచయిత, కోచ్, కుటుంబ వ్యక్తి, గొప్ప నాయకుడు. ఇతరులపై ఇంత ప్రభావం చూపే వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు. ఆయనలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని కిర్‌స్టన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *