కళ్యాణ్ పడాల పై మనసులో మాట బయటపెట్టిన తనూజ, తొందలోనే..?

divyaamedia@gmail.com
2 Min Read

బిగ్‌బాస్ సీజన్-9 విన్నర్‌గా జవాన్ కళ్యాణ్ పడాల నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీసెంట్ గా ముగిసింది. ఈసీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. బిగ్ బాస్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సీజన్ 9 విన్నర్ గా సామన్యుల కోటా నుంచి హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల నిలిచాడు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ మాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు.

ఒక సాధారణ వ్యక్తిగా షోలోకి వచ్చి, ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాకుండా, చివరకు ట్రోఫీని అందుకోవడం అసాధారణమైన విషయం అని చెప్పాలి. ఈ విజయం కళ్యాణ్ పడాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గా సీరియల్ నటి తనూజ పేరు బలంగా వినిపించింది. షో ముందుకు సాగుతున్న కొద్దీ, ఆమెనే విన్నర్ గా నిలుస్తుందని చాలా మంది ఆడియన్స్ నమ్మకంగా ఉన్నారు.

చివరి నిమిషం వరకూ.. ఆమె విన్నర్ అని ఫిక్స్ అయి ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ చివరకు అనూహ్యంగా కళ్యాణ్ పడాల టాప్‌లోకి వచ్చి విన్నర్‌గా నిలవడం షోలో కీలక మలుపుగా మారింది.హౌస్‌లో ఉన్న సమయంలో తనూజ , కళ్యాణ్ మధ్య కనిపించిన స్నేహపూర్వక బంధం ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకిరితో ఒకరికి ఉన్న బంధం గురించి చాల గొప్పగా కూడా చెప్పారు. ఒక్కోసారి ప్రేమగా, మరోసారి కోపంగా వ్యవహరించడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, అలకలు, బుజ్జగింపులు వంటి సన్నివేశాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.

ఒక సందర్భంలో కళ్యాణ్ తనూజకు ప్రపోజ్ చేసినట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఇక వీరిద్దరి మధ్య నిజంగా ఏమైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. అంతే కాదు బిగ్ బాస్ స్టేజ్‌పై, బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో, అలాగే మీడియా ఇంటర్వ్యూల్లోనూ ఈ ఇద్దరి రిలేషన్ గురించే ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి. ఇక ఈ ప్రశ్నలకు తనూజ, కళ్యాణ్ ఇద్దరూ చాలా ఓపికగా సమాధానాలు ఇస్తూ వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన తర్వాత, తనూజ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది.

ఈ సందర్భంగా అభిమానులు , నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చింది. అయితే, మరోసారి ఒక నెటిజన్ తనూజను కళ్యాణ్‌తో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించాడు. దీనికి స్పందించిన తనూజ, “మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పాను. కళ్యాణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. హౌస్‌లో అదే ఉంది. ఇకముందు కూడా అదే ఉంటుంది. అంతకుమించి ఏమీలేదు” అని స్పష్టంగా చెప్పింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *