పెద్ద పెద్ద చదువులు చదివి సినీ పరిశ్రమకు వచ్చినవాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. అలా జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న తన్మయి కూడా బాగానే చదువుకుంది. తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానల్ లో తన్మయి తన చదువు గురించి చెపింది. అయితే మా నాన్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు డబ్బు కోసం ఒకరి దగ్గర ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఇండస్ట్రీ వదిలేసి మా దగ్గరే ఉండు అన్నారు. ఆ విషయంలో నేనే తప్పు చేశాను.
ఆ తర్వాత వాళ్ళు కొట్టడం, తిట్టడం, ఫోన్ చేసి బెదిరించడం లాంటివి చేశారు. ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తా అన్నారు. బయటకు తెలిస్తే మా అమ్మవాళ్ళు బాధపడతారని ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళ వల్ల నేను చాలా బాధపడ్డాను, ఆ భయంతోనే ఓ రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా అని తన్మయ్ చెప్పింది. తనపై జరిగిన వేధింపులు, శారీరక దాడులు, అలాగే ఇండస్ట్రీలోకి రావడాన్ని అడ్డుకోవాలని బెదిరించబడిన విషయాలను తన్మయి పేర్కొంది.

ప్రస్తుతం తనకు ఎటువంటి ప్రేమ సంబంధాలు లేవని, కుటుంబానికి అందాల ఉండటమే తన ప్రధాన లక్ష్యం అని భావిస్తున్నట్టు చెప్పింది. నేను బతికున్నంతకాలం నా కుటుంబానికి సమస్యలు రాకుండా చూసుకుంటాను అని పేర్కొంది. చిన్నతప్పటినుండి తనను ప్రేమగా చూసుకున్న అన్నయ్య తనకు మద్దతుగా ఉన్నారని, ట్రాన్స్‌గా మారిన విషయంపై కుటుంబంలో కొంత అసంతృప్తి ఉండొచ్చని, కానీ అన్నయ్య అండ ఉందని చెప్పుకొచ్చింది.
2013లో మొదలైన జబర్దస్త్ షో 12 సంవత్సరాలుగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను వినోదం పంచుతోంది. తన్మయి విషయానికొస్తే.. పలు షోలు, కొన్ని చిత్రాల్లో కూడా నటించినట్లు సమాచారం.