మగాడు కేవలం దానికోసమే’.. అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చిన టబు, పెళ్లి కూడా..?

divyaamedia@gmail.com
2 Min Read

హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ.. కాని హాఫ్ సెంచరీ దాటిన తరువాత కూడా హీరోయిన్ గానే కొనసాగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో టబు కూడా ఒకరు. గతంలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్ టబు.. ఇప్పుడు కూడా హీరోయిన్‌గానే నటిస్తొంది. గ్లామర్‌ పాత్రలు సాధిస్తూ.. అదరగొడుతోంది. అయితే 53 ఏళ్ల ఈ అందాల తార ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అందుకే ఎక్కడకు వెళ్లినా పెళ్లి,రిలేషన్ షిప్ వంటి ప్రశ్నలు టబుకు ఎదురవుతుంటాయి.

అలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివాహం గురించి ప్రశ్నకు టబు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మగాడు కేవలం బెడ్‌ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని సామాజిక మాధ్యమాలతో పాటు వెబ్ సైట్లలో కథనాలు దర్శనమిచ్చాయి. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో టబు ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని ఆమె టీమ్ స్పష్టం చేసింది.

‘ఇంటర్వ్యూలు, ప్రోగ్రామ్స్‌లో నేనెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని టబు తన ప్రకటనలో స్పష్టం చేసింది. ‘పలు వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ టబు పేరుతో కొన్ని అవమానకరమైన, అసభ్యకరమైన తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ఆమె ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని మేం స్పష్టం చేయాలనుకుంటున్నాము.అభిమానులను తప్పుదారి పట్టించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ వెబ్‌సైట్‌లు తక్షణమే ఈ తప్పుడు ప్రకటనలను తొలగించాలి. ఇందుకు గానూ అధికారికంగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని టబు బృందం తెలిపింది.

‘నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. నా బెడ్‌పై ఒక మగాడు మాత్రమే కావాలి’ అని టబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోది. ఎవరో కావాలనే ఇలా చేశారని అంటున్నారు. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘భూత్ బంగ్లా’ షూటింగ్‌లో బిజీగా ఉంది. అక్షయ్, టబుతో పాటు పరేష్ రావల్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత అక్షయ్‌కుమార్‌, టబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇంతకుముందు వీరిద్దరూ ‘హేరా పేరి’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *