ఓ ముసలావిడను స్మశానంలో దహన సంస్కారాల కోసం చుట్టూ చేరిన అయినవాళ్లు, బంధుజనం చివరి సారిగా బామ్మను చూసుకుని, దుఃఖిస్తున్నారు. ఇంతలో వారికళ్లను వారే నమ్మలేని విధంగా అద్భుతం జరిగింది. చితిపై చలనం లేకుండా పడుకుని ఉన్న భామ్మ కళ్లు తెరచి అమాంతం లేచి కూర్చుంది. అయితే తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన పంపైయ్యన్ (72), అతని భార్య చిన్నమ్మాల్ (62) దంపతులు.
ఏం జరిగిందో తెలియదుగానీ నవంబర్ 16న చిన్నమ్మాల్ పురుగుల మందుతాగింది. దీంతో గమనించిన స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. చిన్నమ్మాల్ మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో బంధువులు ఆమె అంత్యక్రియలకు బంధువులు, ఇరుగుపొరుగు వారు తరలివచ్చారు. ఎమ్ మెట్టుపట్టిలోని స్మశాన వాటికలో చిన్నమ్మాల్ దహన సంస్కారాలకు వందలాది మంది బంధువులు, ఊరి జనాలు తరలివచ్చారు.
చితిపై చిన్నమ్మాల్ శరీరాన్ని ఉంచి, మరి కాసేపట్లో దహనం చేయబోతుండగా.. ఉన్నట్లుండి ఆమె కదలడం ప్రారంభించింది. అనంతరం ఆమె కళ్లు తెరచి తనపై పడి ఏడుస్తున్న బంధువులలో ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె బతికే ఉందని నిర్ధారణ కావడంతో అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను చికిత్స కోసం తిరుచ్చిలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (MGMGH) కు తరలించారు.
ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని తిరుచ్చి పోలీసులు తెలిపారు.
#DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts
— தினமணி (@DinamaniDaily) November 19, 2024