భారతీయ సినిమాల్లో మరణం తర్వాత ఆత్మకు ఏమౌతుందనే నేపథ్యంలో వందల సంఖ్యలో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటివి వాస్తవంగా ఉంటాయా అనే దానికి ఇప్పటికే చాలా సార్లు నిదర్శనం కనిపించింది. అయితే 2019 లో 68 ఏళ్ల షార్లెట్ హోమ్స్ హై బీపీతో అనారోగ్యానికి గురికావటంతో ఆసుపత్రి తరలించారు. ఆమె పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె 11 నిమిషాల పాటు వైద్యపరంగా చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ సమయంలో తాను స్వర్గానికి వెళ్లినట్లు హోమ్స్ పేర్కొంది.
అక్కడ దేవదూతలను, తన కుటుంబ సభ్యులను కలిశానని చెప్పింది. ఇది మనం ఊహించేదానికంటే చాలా అద్భుతంగా ఉంటుందని షార్లెట్ స్వర్గం గురించి వివరించింది. అక్కడ మరణించిన తన తల్లి, తండ్రి, చెల్లిని కలిసిందట. వారు చాలా ఆరోగ్యంగా 30 ఏళ్ల వయసులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పింది. ఈ క్రమంలోనే తాను నరకం కూడా చూశానని చెప్పింది. అక్కడ కొంతమంది నర్సులను చూశానని చెప్పింది. అక్కడ అద్భుతమైన చెట్లు, గడ్డి అన్నీ చూశాను. స్వర్గంలో తాను సువాసనగల పువ్వుల వాసన, మధురమైన సంగీతాన్ని విన్నానని చెప్పింది.
ఈ అద్భుత అనుభవంతో పాటు, తాను నరకాన్ని కూడా చూశానని చెప్పింది. అంతంలోనే మళ్లీ తనను ఎవరో తన శరీరంలోకి లాగబడినట్లుగా అనిపించిందని చెప్పాంది. లేచి చూస్తే ఆసుపత్రి బెడ్‌లో ఉన్నట్లు తెలుసుకుంది. ఆ సమయంలో షార్లెట్ భర్త డానీ తన పక్కనే ఉన్నాడు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అనంతరం చాలా సంవత్సరాల పాటు ఆమె పొందిన ఈ అనుభవాల గురించి అందరితో చెబుతూనే ఉంది.
చివరకు 2023, నవంబర్ 28న 72 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది. అప్పటిదాకా తాను స్వర్గం, మరణాంతర జీవితాన్ని అనుభవించినట్లు చెప్పింది. ప్రజలు ఎప్పుడూ ఆశను కోల్పోవద్దని కోరింది. ఈ విషయం గురించి డానీ ఒక షోలో వెల్లడించారు. షార్లెట్ కోమాలో ఉన్నప్పుడు ఆమె పూల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. నేను చుట్టూ చూశాను, ఆ ఆసుపత్రి రూమ్‌లో పూలు ఏమీ లేవు. అప్పుడే నాకు తెలిసింది, షార్లెట్ అప్పుడు ఈ లోకంలో లేదని తమకు అర్థమైందని చెప్పాడు.