హీరో సూర్య , నటి జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా ఈ జంట పేరుతెచ్చుకున్నారు. సూర్య,జ్యోతికకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. సూర్య, జ్యోతికల కూతురు, కొడుకుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య, జ్యోతికల కూతురు పేరు దియా అలాగే కొడుకు వేరు దేవ్.
అయితే ఇదిలా ఉంటే.. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వస్తున్న సూర్య కుటుంబం ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఆ ఫోటోలలో సూర్య కూతురు దియా అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయ పద్దతిలో ఎంతో చక్కగా కనిపించింది. ఇదంతా పక్కన పెడితే.. అగరం ఫౌండేషన్ అనేది తమిళనాడులోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సూర్య స్థాపించిన సంస్థ.
ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు ఎంతో మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. విధ్యా ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 6700 మంది పైగా మొదటి తరం గ్రాడ్యుయేట్లను తయారు చేసింది. అగరం సంస్థ 15 సంవత్సరాల కార్యక్రమంలో సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక, పిల్లలు దియా, దేవ్, సోదరుడు, నటుడు కార్తీ, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆగస్టు 3న చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్, ‘విదుతలై’ దర్శకుడు వెట్రి మారన్, ‘జై భీమ్’ చిత్రనిర్మాత టీజే జ్ఞానవేల్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
#Suriya #Jyothika family at Tirupati ♥️ pic.twitter.com/UgNuFgz0Iv
— Happy Sharing By Dks (@Dksview) August 5, 2025