అక్కడా పచ్చబొట్టు వేయించుకున్న నటి సురేఖా వాణి. నొప్పితో ఎలా ఏడుస్తుందో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

సెలబ్రెటీలను చూసి ప్రజలు కూడా టాటూలు వేయించుకునేందుకు ఎగబడుతున్నారు. సెలబ్రెటీలలో కొందరైతే ఒళ్లంతా పచ్చబొట్టు వేయించుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. కుర్రకారే కాకుండా వయసుతో సంబంధం లేకుండా కొందరు ముదురు భామలు కూడా టాటూలు వేయించుకుంటూ ముచ్చట తీర్చుకుంటున్నారు. అయితే వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది సురేఖ వాణి. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అక్కగా, వదినగా, అమ్మ పాత్రల్లో అద్భుతంగా నటించింది.

అయితే గతంలోలా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. అయితే ఆ లోటును తీర్చేందుకు సురేఖ కూతురు రెడీ అవుతోంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటిస్తోంది సుప్రిత. అందులో ఒకటి లేచింది మహిళా లోకం. అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి మరో మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు అమ‌రావ‌తికి ఆహ్వానం పేరుతో తెర‌కెక్కుతోన్నమరో హారర్ థ్రిల్లర్ మూవీలోనూ హీరోయిన్ గా కనిపించనుంది సుప్రిత.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సురేఖా వాణి. తన కూతురు సుప్రీతా తో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది సురేఖా వాణి. ఇందులో ఈమె టాటూ వేయించుకుంటూ కనిపించింది. అలాగే కూతురు సుప్రిత కూడా చప్పట్లు కొడుతూ దర్శనమిచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

సురేఖా వాణి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. క్యాప్షన్ చూసి ఎవరా పెదబాబు అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ తర్వాత ఆమె తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలను టాటుగా వేయించుకుందని తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీవారిపై పై సురేఖకు ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *