సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ ఇతన్ని జయం చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు. అయితే తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రమోలో సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.
అసలేమైందంటే.. లేటెస్ట్ ప్రోమోలో హౌస్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకు హౌస్ లో ఉన్నవారి ఫోటోలు ఉంచాడు. హౌస్ మేట్స్ వారికి నచ్చిన బొమ్మ తీసుకొని ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి.. కాగా ఆకారిగా ఎవరు చేరుకుంటారో.. వారి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో వారు నామినేషన్ లోకి వస్తారు అని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా సంజన రీతూ గురించి చెప్పింది.

మొదటి నుంచి నేను ఒంటరిగానే గేమ్ ఆడుతున్నా.. కానీ రీతూ గేమ్ లో ఎక్కడో డిమాన్ పవన్ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది అని తన పాయింట్ చెప్పింది. దాంతో రీతూ కూడా వాదించింది. ఆతర్వాత తనూజాకు సంజనకు మధ్య వాదన జరిగింది. అలాగే తనూజాకు దివ్యకు మధ్య కూడా చిన్న వాదన జరిగింది. ఫైనల్ గా సుమన్ శెట్టి ఆఖరిలో మిగిలిపోవడంతో అతని దగ్గర తనూజ బొమ్మే ఉండటంతో..
నా ఫాల్ట్ కాబట్టి నేను నెమ్మదిగా వెళ్ళాను కాబట్టి తనుజను నామినేట్ చేయాలి అని నేను అనుకోవడం లేదు.. నాకు నేనే నామినేట్ చేసుకుంటున్నా అన్నాడు సుమన్. సుమన్ మాటలకు అందరూ షాక్ అయ్యారు. తర్వాత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు సుమన్ శెట్టి. ఈ వీడియో పై సుమన్ శెట్టి అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
