అప్పట్లో సంచలనం అయిన సుమన్ బ్లూ ఫిల్మ్ కేసుపై సీనియర్ డైరెక్టర్ సాగర్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుమన్ కేసు వల్ల నా సినిమాలు ఎఫెక్ట్ కాలేదు కానీ.. చాలా మందిపై దీని ప్రభావం పడింది. ఫ్రెండ్‌గా నేను ఎంత చేయాలో అంత చేశాను. ఆ సమయంలో అతడికి మానసికంగా చాలా హెల్ప్ అయ్యాను’ అని చెప్పారు. అయితే సుమన్ ను స్టార్ అవ్వకుండా ఇండస్ట్రీలో తొక్కేశారు అన్న రూమర్స్ అప్పట్లో గట్టిగా వినిపించాయి. అంతే కాదు సుమన్ పై హీరోలతో పాటు, రాజకీయ నాయకులు కూడా ప్లాన్ చేసి పడగొట్టారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఏకంగా ముఖ్యమంత్రి సుమన్ ను కేసుల్లో ఇరికించారంటూ గతంలో రూమర్స్ గట్టిగా వినిపించాయి.
సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయడంతో పాటు.. బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో సుమన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది. అయితే అసలు విషయం ఏంటి.. ఎక్కడ పొరపాటు జరిగింది. సుమన్ కేసుల్లో ఇరుక్కొవడానికి ముఖ్యమంత్రికి సబంధం ఏంటి..? అందులో చిరంజీవి పేరు ఎందుకు వినిపించింది. నిజానిజాలు ఏంటి..? సుమన్ ను ఈ విషయంలో ఇరికించాల్సిన అవసరం ఏంటి.? ఆ పని చేసింది ఎవరు..? ఈ విషయాలలో నిజా నిజాలను వెల్లడించారు దర్శకుడు సాగర్.
ఆయన సుమన్ కు చాలా సన్నిహితుడు స్నేహితుడు. గతంలో ఇచ్చిన ఇటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు సాగర్. ఈ విషయాలు వైరల్ గా మారాయి. అయితే సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి. సుమన్ పై కావాలని రాజకీయ కారణాలతో నే ఈ కేసులు పెట్టారన్నరు సాగర్. అంతే కాదు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి MGR కు తెలిసి ఈ విషయం జరిగిందన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి MGR, రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్ ఈ ముగ్గురి వల్లే సుమన్ జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవల్ స్కెచ్ వేసి ఇరికించారు. బెయిల్ కూడా రాకుండా సుమన్ పై కేసులు పెట్టారు.
అన్నింటికి కారణం ఓ అమ్మాయి సుమన్ పై మనసుపడటమే. సుమన్ అందగాడు. ఆరుడుగుల, మంచి కలర్ ఉండటంతో అప్పట్లో అమ్మాయిలు ఆయన వెంటపడేవారట. అందరు అమ్మాయిల్లానే తమిళనాడు అప్పటి డీజీపీ కూతురు కూడా సుమన్ పెంట పడిందట. అయితే అప్పటికే ఆ అమ్మాయి పెళ్ళి జరిగిపోయింది. అయినా సరే సుమన్ షూటింగ్ ఉంటే అక్కడ వాలిపోయి హడావిడి చేసేదట. కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు. సరిగ్గా ఇదే టైమ్ కు కాంట్రాక్టర్ వడయార్ కూతురుని సుమన్ స్నేహిడుతు ఒకరు ప్రేమించడంతో.. పరిస్థితులన్నీ కలిసి సుమన్ కు వ్యతిరేకంగా మారాయి. ఇక ఈ విషయం సరాసరి అప్పటి ముఖ్యమంత్రి MG రామచంద్రన్ కు దగ్గరకు వెళ్ళింది.
దాంతో ఎంజీఆర్ సుమన్ ని పిలిపించాడు. బాబు నువ్వు నటుడివి. ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ చెప్పారట. లేకుంటే ఏం జరుగుతుందో కూడా చెప్పారట. అప్పుడు సుమన్ కూడా అందులో తన తప్పు లేదని డైరెక్ట్ గా చెప్పకుండా.. ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది.. ఆ అమ్మాయికి చెప్పండి అని అన్నాడట. సుమన్ సున్నితంగానే అన్నా.. అది నిర్లక్ష్యంగా అన్నట్టు కన్వే అయ్యిందట. ఎమ్జీఆర్ కు సుమన్ సమాధానం నచ్చలేదు. డీజీపీకి సుమన్ పై కోపం ఉంది. వడయార్ కు సుమన్ ఫ్రెండ్ పై కోపం ఉంది.