అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. అయితే సుమ తన చర్మ సమస్యల గురించి కీలక విషయాలు వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ కనకాల పేరు తెలియని వారుండరు. చలాకీతనం, మాటలతో టీవీ ప్రేక్షకుల మనసు దోచుకున్న సుమ యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా యాంకర్ సుమ అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది.
ఓ వైపు యాకరింగ్లో బిజీగా ఉంటూనే సినిమాల్లో నటిస్తుంది సుమ. ఇక ఆమె జయమ్మ పంచాయతీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కేరళలో పుట్టి పెరిగిన ఈ మలయాళీ బ్యూటీ తెలుగింటి కోడలిగా అందరికీ దగ్గరైంది. స్పాంటేనియస్ హ్యూమర్‌తో ఏ షో అయినా నడిపించగలిగే సత్తా ఆమె సొంతం. టీవీ రంగంలో ఆమె ఓ మెగాస్టార్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం సుమ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేస్తూనే పలు టీవీ ఛానళ్లలో షోలు చేస్తుంది సుమ కనకాల. దాదాపు అందరి కంటే ఎక్కువ రెమ్మునరేషన్ తీసుకుంటున్న యాంకర్లలో సమ ఒకరు. ఇక ఇప్పటికే సుమ పవిత్ర ప్రేమ, వర్షం, ఢీ, బాద్షా వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత జయమ్మ పంచాయతీ సినిమాలో కనిపించారు. 47 ఏళ్ల వయసులో కూడా సుమ యాంకరింగ్ చేస్తూ కుర్ర యాంకర్లకు పోటీగా నిలుస్తుంది. యాంకర్ సుమకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
తన యూట్యూబ్ ఛానల్లో ఈ వ్యాధి గురించి చెబుతూ సుమ ఈ ఇన్ఫెక్షన్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. కీలాయిడ్ టెండెన్సీ అనేది స్కిన్ ప్రాబ్లమ్. అది మరింత పెద్దగా మారుతుందని, చిన్న గాయం కూడా పెద్దగా అవుతుందని చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కెరీర్ ప్రారంభ రోజుల్లో మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి తెలియక పోవడం వల్లే ఇది జరిగినట్లు సుమ తెలిపింది. ఎన్నో చికిత్సలు ప్రయత్నించినప్పటికీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదని తెలిపింది. ప్రస్తుం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.