రామనాథపురం జిల్లాలోని తొండి సముద్ర తీర ప్రాంతంలో ‘మండాడి’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో, కెమెరాలు మరియు ఇతర ముఖ్యమైన సామాగ్రితో సాంకేతిక నిపుణులు ఒక పడవలో సముద్రంలోకి వెళ్లారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది.
ఈ చిత్ర షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయాయి. మండాది సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నాడు. RS ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
సుహాస్, సూరిలతో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Video – A boat capsized during the shooting of #Soori's film #Mandaadi, causing damage to the cameras on board….🫣
— Movie Tamil (@_MovieTamil) October 4, 2025
– This kind of accident happened while the shooting of this film was taking place at a location called Thundi in Ramanathapuram….🥹
pic.twitter.com/yDjTrLOHT1