సుదీప పింకీ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా లో పింకీ క్యారెక్టర్ లో అందరినీ అలరించింది. ఆ తర్వాత సుదీప కొన్ని సీరియల్స్‌లో కూడా నటించారు. కొన్నాళ్లు సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చిన సుదీప ఇక బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
అయితే తాజాగా భర్త శ్రీరంగనాథ్తో కలిసి మెటర్నటీ షూట్ చేయించుకున్న సుదీప ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘ నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది.. ప్రేమ మమ్మల్ని బలంగా ఉంచింది. ఇప్పుడు మా ఫ్యామిలీ మరింత పెద్దదవుతోంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది సుదీప.
పింకీ అలియాస్ సుదీప్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నటికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సుదీపకు పెళ్లయి దాదాపు 12 ఏళ్లవుతోంది.
2015లో మొదటి సారి గర్భం దాల్చింది. అయితే అదే సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య ఉండడంతో బిడ్డను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో వెల్లడించింది.