జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును తెచ్చుకున్న సుధీర్ ఈ షో ద్వారానే తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా కమెడియన్గా భారీగా ఫేమ్ ని సంపాదించుకున్నాడు సుధీర్. ఇక అదే క్రేజ్ తో కొన్ని సినిమాలలో కమెడియన్ గా అవకాశాలను సంపాదించుకుని చిన్న చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి.
జబర్దస్త్ షోలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ టీవీ షోల్లోనూ వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం, లవ్ సాంగ్స్ వేయడంతో అందరూ నిజగానే ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. గతంలో ఓ షోలో వీరిద్దరికీ పెళ్లి కూడా చేశారు. కానీ అది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని సుదీర్, రష్మీ క్లారిటీ ఇచ్చారు. కాగా ఇప్పుడు సుదీర్ పెళ్ళికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. త్వరలో సుధీర్ పెళ్లి గురించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుదీర్ హీరోగా నటించిన గోట్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.