ఓ ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ తన కెరీర్, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొత్త నటీమణులు ఇండస్ట్రీలోకి రావడం వల్ల తన పాత్రలకు ఎటువంటి ఆటంకం కలగడం లేదని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు తనకు ఆఫర్ వచ్చిందని సుధ వెల్లడించారు. కొన్ని కారణాలతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారని అన్నారు. అయితే ఒక్క సంతకంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కోట్ల ఆస్తి పోగొట్టుకుంది. భర్త, కొడుకు ఇద్దరిని కోల్పోయింది.
సుధ 1984లో మోహన్, ఊర్వశి జంటగా నటించిన ‘ఓ మనే మనే’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె అసలు పేరు హేమ సుధ. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న సుధ.. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. చాలా కాలంగా ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి బయటపెట్టారు.
ధనిక కుటుంబంలో పుట్టిన ఆమెకు.. నలుగురు అన్నయ్యలు. ఒకే ఒక్క అమ్మాయి కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో తన తల్లి ఆస్తి మొత్తాన్ని వదలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు డబ్బుతోపాటు కీర్తి కూడా వచ్చిందని తెలిపింది. కానీ అదే సమయంలో కష్టాలు కూడా వచ్చాయని తెలిపింది. ఢిల్లీలో ఒక హోటల్ ప్రారంభించానని.. కానీ ఒకే ఒక్క సంతకంతో తన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నానని తెలిపింది.
అలాగే తన కొడుకు తనతో గొడవ పెట్టుకుని విదేశాలకు వెళ్లిపోయాడని తెలిపింది. భర్త, కొడుకు ఇద్దరు తనను వదిలేసి వెళ్లిపోయారని.. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. సుధ సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించింది.
