ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..! రెండు సార్లు లేచిపోయి పెళ్లి చేసుకుంది, కట్ చేస్తే చివరికి..!

divyaamedia@gmail.com
1 Min Read

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఓ స్టార్ హీరోతోనే ప్రేమలో పడింది. ఆయనతో లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఆ హీరోతో విడాకులు తీసుకొని, తనకంటే 12 ఏళ్లు పెద్దవాడైన ఓ ఫిల్మ్‌మేకర్‌తో రిలేషన్‌షిప్ నడిపింది. అతనితో మరోసారి లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సిల్వర్‌స్క్రీన్‌కు దూరమైంది. ఆ నటి ఎవరో కాదు, బిందియా గోస్వామి..

ఈ స్టార్ హీరోయిన్.. 1970 మరియు 1980 దశకాలలో హిందీ సినిమాల్లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. ఈ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం ఆమె సినీ కెరీర్ కంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది. బిందియా గోస్వామి జనవరి 6, 1962న రాజస్థాన్‌లోని కామన్, భరత్‌పూర్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ రెండు సార్లు పెళ్లి చేసుకుంది. బిందియా 18 సంవత్సరాల వయస్సులో, 1980లో తన తరచూ సహనటుడైన వినోద్ మెహ్రాను పారిపోయి వివాహం చేసుకుంది.

వినోద్ అప్పటికే మీనా బ్రోకాతో వివాహం జరిగింది.. ఆతర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ వివాహం గురించి మీడియాలో వచ్చిన ప్రచారం బిందియా కెరీర్‌ను దెబ్బతీసింది. 1985లో, బిందియా దర్శకుడు జె.పి. దత్తాతో ప్రేమలో పడి, అతనితో కూడా లేచిపోయి వివాహం చేసుకుంది. జె.పి. దత్తా ఆమె కంటే 12-13 సంవత్సరాలు పెద్దవాడు. వారి కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని, వారు రహస్యంగా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి నిధి, సిద్ధి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రెండో పెళ్లి తర్వాత బిందియా గోస్వామి సినిమాలకు దూరం అయ్యింది. రెండు సార్లు లేచిపోయి వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. బిందియా గోస్వామి మాత్రమే కాదు ఆమె తండ్రి ఏకంగా ఏడుసార్లు పెళ్లి చేసుకున్నాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *