మలయాళ హీరో. ప్రముఖ నటి టి.పి.రాధామణి కొడుకు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నాడు. అభినయ్ తళుల్లువదో ఇళమై సినిమాతో యాక్టర్ గా పరిచయం అయ్యాడు. జంక్షన్ అనే తమిళ సినిమాలో హీరోగా కూడా చేశాడు. అయితే ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఏర్పడింది. తళ్లుల్లువో ఇళమై సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత జంక్షన్ అనే తమిళ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
ఆ తర్వాత సక్సెస్ దాస్, పొన్ మేఘలై, సొల్ల సొల్ల ఇనిక్కుం, అరుముగం, ఆరోహణం వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. 2014 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నాడు. చివరగా వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. సినిమాలతోపాటు పలు వాణిజ్య ప్రకటనలలోనూ కనిపించారు.

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు పదేళ్లుగా ఏ సినిమాలో నటించలేదు. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అభినయ్.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అలాగే అనారోగ్య సమస్యలు సైతం వేధిస్తున్నాయి. చిన్న ఇంట్లో ఉంటూ.. ప్రభుత్వం నడిపే క్యాంటీన్ లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. కొన్ని రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు.
తాజాగా తమిళ కమెడియన్ కేపీవై బాలా అభినయ్ ను కలిసి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. తనకు కాలేయ వ్యాధి మరింత ముదిరిందని.. ఇంకా ఏడాది మాత్రమే తాను బతుకుతానని ఎమోషనల్ అయ్యారు. దీంతో బాలా అతడికి ధైర్యం చెబుతూ.. తప్పకుండా వ్యాధి నయమవుతుందని.. మళ్లీ సినిమాలు చేస్తావు అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.