సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా చేరిన రియల్‌ స్టార్ హీరో. ఆ హీరో ఎవరంటే..!

divyaamedia@gmail.com
2 Min Read

దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరుల కథల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కార్గిల్ యుద్ధంలో చాలా మంది సైనికులు ప్రాణాలు అర్పించారు. ఈ యుద్ధం ఎంతో మంది భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. బాలీవుడ్‌లో ఈ యుద్ధం స్ఫూర్తితో చాలా సినిమాలు రూపొందాయి. సైనికుల జీవితాలు వెండితెరపై నిలవడం కాదు.. సినిమా నటులు యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నానా పటేకర్ హిందీ చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నానా పటేకర్ మిలటరీ జీవితానికి కొత్త కాదు. 1990లో తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠ లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొనాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే కోరికను తెలిపాడు. అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని చెప్పాడు. దీంతో వెంటనే అతడికి అనుమతి ఇచ్చారు.

1999 ఆగస్టులో నానా పటేకర్ ఏకంగా రెండు వారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు.అక్కడ సైనికులకు సాయం చేయడం.. గాయపడిన వారి కోసం బేస్ హాస్పిటల్లో పనిచేయడం లాంటి పనులు చేశాడు. అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని.. శ్రీనగర్ కు వెళ్లేప్పుడు తాను 76 కిలోల బరువు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు తెలిపాడు. కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత నానా పటేకర్ మళ్లీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. గతేడాది వన్వాస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు.

అంతేకాదు.. అంతకుముందు విభిన్నమైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా దేశం కోసం సేవ చేశాడు. ఈ విషయం తెలిసి నానా పటేకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *