ఎస్. కృష్ణమూర్తి.. ఆయన వయసు 71 ఏళ్లు. దూరదర్శన్‌లో గిటార్ ప్లేయర్‌గా పని చేసిన కృష్ణమూర్తి, ఆ తర్వాత ఏ.ఆర్. రెహ్మాన్‌కి మెంటర్‌గా వ్యవహరించాడు. ఈ విషయాన్ని ఏ.ఆర్. రెహ్మాన్, ‘తెనాలి’ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో స్వయంగా ప్రకటించాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం చెన్నైలో తుది శ్వాస విడిచారు.
దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మదన్ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఇవాళ మదన్ బాబ్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది. కాగా మదన్ బాబ్ అసలు పేరు ఎస్. కృష్ణమూర్తి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మదన్ బాబు గా మార్చుకున్నారు.
తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్య, విజయ్, మాధవన్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వందలాది సినిమాల్లో నటించి ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తారు. మదన్ బాబు సినిమాల్లోనే కాకుండా టెలివిజన్‌లో కూడా పనిచేశారు. టీవీ కామెడీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపించారు. ఇక నటనతో పాటు, మదన్ బాబుకు సంగీతంపై కూడా ఆసక్తి ఉండేది.
ఆయన మంచి కీబోర్డ్ ప్లేయర్. తమిళంలో ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్, లింగ, రాయన్ తదితర చిత్రాల్లో మదన్ బాబ్ నటించారు. ఈ చిత్రాలన్నీ తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. అయితే మదన్ డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాలో ఒక చిన్న పాత్రలో ఆయన కనిపించారు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
We shared the screen, and his presence always brought joy to the set.
— Prabhudheva (@PDdancing) August 2, 2025
Cheerful, kind, and full of humour he made everyone feel happy around him.
Heartfelt condolences to his family.
He’ll always be remembered 🙏 pic.twitter.com/Ji5sqMlsDW