షాహిర్ కు పాన్-ఇండియా స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన చిత్రం మంజుమ్మల్ బాయ్స్. 2024 లో విడుదలైన ఆ చిత్రంతో దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. దీని తర్వాత మళ్లీ ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కూలీలో నటిస్తున్నాడీ స్టార్ యాక్టర్. అయితే.. సినిమా లాభాల పంపకాల విషయంలో కొంత కాలంగా నిర్మాతలు సౌబిన్ షాహిర్ అతని తండ్రి బాబు షాహిర్,
షాన్ ఆంటోనీలు తమ వద్ద రూ.7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, ఆపై సినిమాకు వచ్చిన లాభాల్లో ముందుగా అనుకున్న ప్రకారం 40 % వాటా ఇవ్వడం లేదని సుమారు రూ.47 కోట్ల మేర మోసం చేశారంటూ సిరాజ్ వలియతర హమీద్ అనే పెట్టుబడిదారు కోర్టును అశ్రయించాడు.

దీంతో నిర్మాతలపై 2024 ఏప్రిల్ 23న చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదవగా ఏడాదిగా కేసు రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సదరు నిర్మాతలు కేరళ కోర్టుకు వెళ్లారు.
అయితే కోర్టు వారికి తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ FIR రద్దు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో మారాడు స్టేషన్ పోలీసులు సోమవారం వారిని విచారణకు పిలిచి అనంతరం అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియానే కాకుండా యావత్ ఫిలిం ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది.