ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతం అయినా శ్రీశైలం, మహానంది, తెలంగాణ మున్నూరు వరకు నల్లమల ఫారెస్ట్ ఉన్న నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో గత 6 నెలలుగా చిరుతల సంచారం ఎక్కువవుతోంది.
ఈ మధ్యకాలంలో మార్గంలో గల పూజారి ఇంట్లో సీసీటీవిలో రికార్డు అయిన చిరుత గ్రామంలోని ఓ ఇంట్లో 30 వేలు విలువ గల రెండు పెంపుడు కుక్కలను నాలుగు నెలల క్రితం ఎత్తుకెళ్లిన ఘటన చూశాం. అయితే మున్ననూరు- శ్రీశైలంలో అకస్మాత్తుగా ఓ పెద్దపులి ఫారెస్ట్ లో తిరుగుతూ వారి కంటపడింది.
ఇది చూసిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆ ప్రయాణికులు పెద్దపులిని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నల్లమల్ల అడవిలో పెద్దపులి గంభీరంగా తిరుగుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దీనిపై ఇటీవల తెలంగాణలో పులుల దాడులలో చాలామంది గాయపడ్డారని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని పెద్ద పులి జనావాసంలోకి రాకుండా చూడాలని కోరుతున్నారు. అంతేగాక శ్రీశైలం ఘాట్ రోడ్డులో హెచ్చరికలు జారీ చేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని సూచిస్తున్నారు.