కొంతమందేమో పెళ్లికి రెడీ అయిన శ్రీలీల అంటే.. మరి కొంతమందేమో కొత్తపెళ్లి కూతురిలా మెరిసిపోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది మ్యాటర్ ఏంటి బేబీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా బ్రైడల్ లుక్ లో ఉన్న శ్రీలీల ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అయితే మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. పాపులర్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలల .
తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో బిజీగా ఉంటోంది. అమెరికాలో పుట్టిన శ్రీలీల.. బెంగళూరులో పెరిగింది. చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మెడిసిన్‌లో చేరింది. ఈ క్రమంలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. 2017లో ‘చిత్రంగద’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. 2019లో కన్నడ సినిమా ‘కిస్’తో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘భరాత్’ సినిమాలో చేసింది.

2021లో రోషన్ హీరోగా వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. మొదటి సినిమాతోనే శ్రీలీల తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. ముఖ్యంగా, ఈ అమ్మడి డ్యాన్సింగ్ స్కిల్స్ ఫిల్మ్‌మేకర్లను మరింతగా అట్రాక్ట్ చేశాయి. దీంతో, శ్రీలీలకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా, చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడిపింది. ఒకానొక సమయంలో ఏకంగా 8 సినిమాలను చేసి మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, స్కంధ, ఆదికేశవ వంటి బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటించింది.
ఈ హీరోయిన్ చేసిన సినిమాల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయినప్పటికీ ఈమెకు మాత్రం డిమాండ్, పాపులారిటీ తగ్గలేదు. పుష్ప 2లో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ చేశాక ఆమె పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. ఇక, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టడానికి రెడీ అవుతోంది. అనురాగ్ బసు చేస్తున్న రొమాంటిక్ డ్రామాలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించడానికి రెడీ అవుతోంది. :శ్రీలీల కెరీర్ పీక్స్‌లో ఉండగా ఊహించని నిర్ణయం తీసుకుంది. 24 ఏళ్ల వయసులోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకొని తల్లిగా మారింది. అయితే, ప్రస్తుతం వీరితో ఉండకుండా విడిగా నివసిస్తోంది.
పిల్లల దత్తతపై స్పందిస్తూ.. ‘నేను జన్మనిచ్చిన తల్లిని కాకపోయినా వారికి మాత్రం తల్లిలాంటిదాన్ని. నేను 2019లో కిస్ సినిమా చేస్తుండగా ఆ డైరెక్టర్ నన్నొక ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడే నా ముగ్గురు పిల్లల్ని కలిశాను. ఈ విషయం ఎప్పటినుంచో రహస్యంగా ఉంది. అయితే, వీలు చిక్కినప్పుడల్లా వారితో ఫోన్లో మాట్లాడతాను. అవసరమైతే వారిని చూసొస్తాను’ అని వివరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన పరాశక్తి సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతుంది.
