శ్రీకాంత్ గా ప్రసిద్ధిచెందిన మేకా శ్రీకాంత్ ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే శ్రీకాంత్ కెరీర్ లో భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ గురించి. ఆమె సైతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్. అందం, అభినయంతో కట్టిపడేసింది. నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది.
ఇక శ్రీకాంత్ భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ మరెవరో కాదండి.. స్నేహ. 90వ దశకంలో స్టార్ హీరోగా అలరించిన శ్రీకాంత్.. ఆ తర్వాత సహయ పాత్రలు పోషించారు. శ్రీకాంత్, స్నేహ జోడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఒక సినిమాలో శ్రీకాంత్ భార్యగా కనిపించిన స్నేహ.. మరో చిత్రంలో వదినగా కనిపించింది.
2005లో డైరెక్టర్ బాపు తెరకెక్కించిన రాధా గోపాలం సినిమాలో శ్రీకాంత్, స్నేహ భార్యభర్తలుగా కనిపించారు. ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతి సినిమాలోనూ వీరిద్దరు నటించారు. అయితే ఇందులో స్నేహ వెంకటేశ్ భార్యగా నటించగా.. శ్రీకాంత్ వెంకీ తమ్ముడిగా కనిపించారు. అంటే సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ వదినగా నటించింది స్నేహ.
సంప్రదాయ పద్దతిగా, చూడచక్కని నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న స్నేహ… ఇప్పుడు అక్క, వదిన పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాకుండా సొంతంగా చీరల బిజినెస్ స్టార్ట్ చేసింది.