గత నాలుగు వారాలుగా ఎలిమినేషన్ ప్రక్రియలో ఎలాంటి సంచలనాలు లేకపోవడంతో ఈ వారం కూడా సాదాసీదాగా కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి బయటకు పంపిస్తారని అందరూ అనుకొన్నారు. కానీ డబుల్ ఎలిమినేషన్ పేరుతో ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్‌ను రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా బయటకు పంపించారు. అయితే నెలలకు రెండు లక్షలకు పైగా జీతం వచ్చే కంపెనీని విడిచి పెట్టి మరీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.
అనుకున్నట్లు గానే అగ్ని పరీక్షలో సత్తా చాటింది. కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తర్వాత చాలా మెచ్యూర్డ్ గా గేమ్ ఆడింది. ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఇక అంతా బాగుంటుందనుకున్న తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది శ్రీజ. దీనిపై భిన్న రకాల వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందలో మెజారిటీ ఆడియెన్స్ శ్రీజది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు.
ఆమెను మళ్లీ హౌస్ లోకి తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ కు మెసేజులు పంపుతన్నారు. మరోవైపు శ్రీజ కూడా ఈ ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోను షేర్ చేసింది. ‘ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైమ్‌లో హౌస్‌లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది.
అగ్నిపరీక్ష కంటెస్టెంట్ దాటేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్‌బాస్ రియాలిటీ షో కోసం ఒక పర్మినెంట్ ట్యాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్‌ను కూడా వదులుకున్నాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేశాను. అయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు. ఎలిమినేషన్ రౌండ్‌లో కూడా ప్రతి టాస్క్‌లో చివరి వరకు వెళ్లాను.
కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్స్‌లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదని అందరూ అంటుననారు. 5వారాలు హౌస్‌లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను’ అని కన్నీళ్లు పెట్టుకుంది శ్రీజ.
