ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

హీరోల స్థాయిలో కాకపోయినా హీరోయిన్లు కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్​తో చిన్న సినిమాలు రెండు, మూడు తీసి విడుదల చేసేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టే వారు అందుకునే మొత్తం ఏ రేంజ్​లో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పట్లో థియేటర్లలోకి జనాలు రావడం పెరిగింది.

దీంతో అప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షలు పారితోషికం తీసుకునే నటులు రూ.కోటి పైగా వసూలు చేశారు. అయితే అప్పట్లోనే ఓ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీని ఏలేసింది. స్టార్ హీరోలకు ధీటుగా ఒక్కో చిత్రానికి రూ. 1 కోటికి పైగ రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమె మరెవరో కాదు.. దివంగత హీరోయిన్ శ్రీదేవి. అప్పట్లో ఆమెతో కలిసి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.

భారతీయ సినిమా ప్రపంచంలో మొదటి సారి కోటి పారితోషికం తీసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 1992లో వచ్చిన అపద్బాంధవుడు సినిమాకు చిరు ఏకంగా కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత అంతే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 1993లో విడుదలైన ‘రూప్ కి రాణి సోరోం కా రాజా’ అనే హిందీ చిత్రానికి నటి శ్రీదేవికి కోటి రూపాయలు పారితోషికం తీసుకుందట.

అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. అప్పట్లో అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలకు మాత్రమే కోట్లలో జీతాలు ఉండేవి. 1997లో సినిమా నుంచి రిటైర్ అయ్యేవరకు ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా దూసుకుపోయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *