Sreeleela: డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన మెగాస్టార్ సినిమాకి నో చెప్పిన శ్రీలీల.

divyaamedia@gmail.com
2 Min Read

Sreeleela: డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన మెగాస్టార్ సినిమాకి నో చెప్పిన శ్రీలీల.

Sreeleela: లేలేత అందచందాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది శ్రీలీల. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తోంది. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ వయ్యారాలన్నీ ఒలకబోస్తూ కుర్రాళ్లను చిత్తు చేస్తోంది. అయితే శ్రీలీల.. ఆరేడు, నెలల కిందటి వరకు ఈ అమ్మడి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. నెలకో సినిమా రిలీజ్ చేస్తూ అటు సోషల్ మీడియాలో, ఇటు థియేటర్లలో తెగ సందడి చేసింది. అయితే అదంతా మూడ్నెళ్ల ముచ్చటే అని కన్నడ బ్యూటీకి ఇప్పుడిప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఏడాది కిందట వచ్చిన ‘ధమాకా’ తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు మరో సాలిడ్ హిట్టు కొట్టలేదు.

Also Read: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?

మహేష్ తో సినిమా చేశానన్న సంతోషమే గానీ… గంటూరు కారం సినిమా కూడా శ్రీలీలను కాపడాలేకపోయింది. మహేష్ వన్ మ్యాన్ షో తప్పితే.. ఫ్యాన్స్ సైతం ఈ సినిమాకు రిపీటెడ్ షోలు వేయలేకపోయారు. సెప్టెంబర్ నుంచి శ్రీలీలకు ఫ్లాపుల రోత మోదలైంది. రామ్ తో కలిసి నటించిన స్కంధ సినిమా ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత దసరా పండక్కు రిలీజైన భగవంత్ కేసరి వంద కోట్ల కలెక్షన్లు కొట్టిందన్న మాటే కానీ… బాలయ్య డామినేషన్ చేయడంతో శ్రీలీలకు పెద్దగా పేరు రాలేదు.

మరీ ముఖ్యంగా ఇందులో శ్రీలీల గ్లామర్ కు, డ్యాన్స్‌లకు అతీతంగా కనిపించడంతో సగటు శ్రీలీల ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అయ్యాడు. దాంతో ఆ హిట్టు కాస్త బాలయ్య అకౌంట్ లోకి వెళ్లిపోయింది. ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి చేసిన ఆదికేశవ పట్టు మని పది రోజులు కూడా థియేటర్లలో ఉండలేకపోయింది. కాకపోతే టీవీల్లో మాత్రం టెర్రిఫిక్ టీఆర్‌పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజైన రెండు వారాలకు ఈ బ్యూటీ నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా రిలీజైంది. టీజర్, ట్రైలర్ లు ఊపేశాయి కానీ.. తీరా థియేటర్లకు వచ్చేశాక తుస్సుమంది.

Also Read: ఆ డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న శిల్పా, అసలు విషయమేంటంటే..?

ప్రస్తుతం ఈ బ్యూటీ లైనప్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందో తెలియడం లేదు. ఇక ఇన్నీ ఫ్లాపులు పలకరించా కానీ ఈ బ్యూటీకి ఆఫర్ల కొరత మాత్రం లేదని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో ఈ బ్యూటీనే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇదీ కాకుండా తమిళంలో రెండు సినిమాలకు సైన్ చేసిందట. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది. రెమ్యునరేషన్ డబుల్ ఇస్తామని చెప్పినా కానీ తను చేయను అని నిర్మొహమాటంగా చెప్పేసింది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *