స్టార్స్ నుంచి సామాన్యుల వరకూ చాలామంది టాటూస్తో కనిపిస్తున్నారు. ఇక ఏ హీరో అయిన టాటూ వేసుకున్నాడంటే.. ఇక అభిమానుల శరీరాలపై అదే టాటూ కనిపిస్తుంటుంది. అయితే గతంలో దీన్నే పచ్చబొట్టు అని పిలిచేవారు. జ్ఞపకాలు పదిలంగా దాచుకోవడం కోసం ఇలా పచ్చ బొట్టు వేసుకునేవారు. ఇక వెనకటి నటీనటులలో ఈ ట్రెండ్ తక్కువే కాని.. పచ్చబొట్టు బేస్ చేసుకుని.. సినిమాలు, పాటులు చాలా వచ్చాయి.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఆ లిస్టు లోకి వస్తాడు మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు . ఎస్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఒంటి పై ఒకే ఒక్క పచ్చబొట్టు ఉంది. అది కూడా ఆయన ఎంతో ఇష్టంగా వేయించుకునింది . ఆ పచ్చబొట్టు మరెదో కాదు “ఓం”. మొదటి నుంచి దైవభక్తి గల సీనియర్ ఎన్టీ రామారావు గారు .. తన వంటిపై ఒకే ఒక పచ్చబొట్టును పొడిపించుకున్నాడు.
అది కూడా రాజకీయాల్లోకి వచ్చే ముందు . యస్.. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ దేవుడు అనుగ్రహం ఆయన పైన ఉండాలి అని ..ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నానని.. భక్తి భావంతో “ఓం” అనే టాటూను ఆయన ఒంటిపై వేయించుకున్నాడు. ఈ విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
కాగా సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు . అటు రాజకీయాలలోనూ ఇటు సినిమాలలోను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఇప్పుడు మనమధ్య లేకపోయినా సరే ఆయనే ఫేవరెట్ హీరో అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తూ ఆయన పేరు జపిస్తూ ఉండడం గమనార్హం. ఈ ఒక్క విషయం తో చెప్పొచ్చు సినీ ఇండస్ట్రిలో సీనియర్ ఎన్టీ రామారావు గారి స్థానం ఏంటో..!